అసుర ట్రైలర్‌తో ఆకాశంలో అంచనాలు… అదిరిన డైలాగ్స్

నారా రోహిత్ అప్‌కమింగ్ మూవీ అసుర సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెంచేసింది. ట్రైలర్‌లో రోహిత్ చెప్పిన డైలాగ్స్ కేక పెట్టిస్తున్నాయి. రోహిత్ డైలాగ్ డెలీవరీ కూడా ఎక్స్‌లెంట్‌గా ఉందన్న ప్రశంసలు వస్తున్నాయి.

నారా రోహిత్-ప్రియా బెనర్జీ జంటగా నటించిన ఈ సినిమా నారా రోహిత్ సమర్పణలో తెరకెక్కుతోంది. సాయి కార్తీక్ స్వరాలందించారు. ట్రైలర్‌లోనే డైలాగ్స్ ఓ రేంజ్‌లో ఉండడంతో సినిమా సూపర్ హిట్ అవుతుందని ట్రేడ్‌వర్గాల్లో టాక్ వస్తోంది. సినిమాలో రోహిత్ చెప్పిన డైలాగ్స్ ఇలా ఉన్నాయి. 

– రేయ్ నా టైమింగ్ మామూలుగా ఉండదు.. నీకు అర్థమయ్యేలోపలే అంతా అయిపోద్ది. 

– నోటితో చెప్పే మాట కన్నా చేత్తో చెప్పే మాటే ఎక్కువ గుర్తుంటుంది సార్

– నీకు లాఠీలు అక్కర్లేదు బాబు.. మాటలతోనే కొట్టేస్తావ్

– మా వాళ్లంతా యావరేజ్‌గా ఉన్నారు కదా… నేనే బాగున్నాను కదా

– నేరం, పాపం ఒకటేరా ఒకసారి చేస్తే చచ్చేంత వరకు నీ వెనకే వస్తాయి

– ఇప్పటి నుంచి నేను నీకు కనిపించను…నేను మొదలు పెట్టిన ఆట మాత్రమే కనిపిస్తుంది

– సమస్య నాది కానప్పుడే నేను మనిషిని కాను..అదే సమస్య నాదైతే 

– రాక్షసులా వాళ్లు ఎప్పుడైనా గెలిచారా