‘ఆప్’ సోపాలు..వరుస వివాదాల్లో ఆమ్ ఆద్మీ

ఆప్ ప్రభుత్వాన్ని వరుస వివాదాలు పట్టి పీడిస్తున్నాయి. ఇటీవల ఢిల్లీ న్యాయశాఖ మంత్రి విద్యార్హతలపై దుమారం చల్లారకముందే అప్పుడే సమస్యలో చిక్కుకుంది. తాజాగా  పార్టీ మహిళా కార్యకర్తను  వేధించారనే ఆరోపణలపై  ఢిల్లీ మహిళా కమిషన్ ఆపార్టీ నేత కుమార్ విశ్వాస్ కు సమన్లు జారీ చేసింది.  పార్టీ నేత కుమార్ విశ్వాస్   పార్టీ మహిళా కార్యకర్తను వేధించినట్టుగా  ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

అమేధీలో పార్టీ క్రియాశీల కార్యకర్తగా పనిచేస్తున్న ఓ మహిళను లోక్ సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కుమార్ విశ్వాస్ వేధించినట్టుగా తమకు ఫిర్యాదు అందిందని మహిళా కమిషన్ సమన్లలో పేర్కొంది. ఆరోపణలపై విశ్వాస్ కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలని  కమిషన్  తెలిపింది.
మరోవైపు ఈ ఆరోపణలను ఆప్ కొట్టి పారేస్తోంది. ఇంతవరకు తమకెలాంటి సమన్లు అందలేదని చెప్తోంది.

 ఏమైనా ఇలా వరుస వివాదాలు రేగడం ఆప్ కు భవిష్యత్ లో మంచిది కావని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.మరి ఆప్ నేతలు వీటి నుంచి ఎలా బయటపడతారో.