ఆ పోస్ట‌ర్ వ‌చ్చేసిందోచ్..!

ఏడాదిన్న‌ర‌గా ర‌జినీకాంత్ అభిమానులు క‌ళ్ళు కాయ‌లు కాచేలా వేచి చూస్తోన్న పోస్ట‌ర్ అది.. ఎంత‌మంది ఎన్ని చెప్పినా.. క‌బాలి విడుద‌ల‌పై ఎంత క్లారిటీ ఇచ్చినా ఫ్యాన్స్ లో మాత్రం ఇంకా ఏదో తెలియ‌ని అనుమానాలు. ఇక ఇప్పుడు ఆ సందేహాల‌కు స‌మాధానం కూడా దొరికేసింది. క‌బాలి విడుద‌ల తేదీపై పూర్తి క్లారిటీ వ‌చ్చేసింది. నిర్మాత క‌ళైపులి ఎస్ థాను మూడు రోజుల కిందే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినా.. ఇప్ప‌టికీ అభిమానుల్లో మాత్రం ఏదో ఓ టెన్ష‌న్. చెప్పిన టైమ్ కు సినిమా వ‌స్తుందా రాదా అన్న చిన్న కంగారు.
ఇప్పుడు అవ‌న్నీ పూర్తయ్యాయి. జులై 22 న క‌బాలి విడుద‌ల క‌న్ఫ‌ర్మ్ అయిపోయింది. ఇప్ప‌టికే సెన్సార్ కూడా పూర్తైపోయింది. క్లీన్ యు స‌ర్టిఫికేట్ వ‌చ్చింది. దాదాపు మూడు గంట‌ల నిడివితో వ‌చ్చేస్తోంది క‌బాలి. జులై 22న వస్తుందంటూ అఫీషియ‌ల్ గా పోస్టర్స్ కూడా విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ర‌జినీకాంత్ మ‌న‌సులో రాధికాఆప్టే క‌నిపించేలా డిజైన్ చేసిన ఈ పోస్ట‌ర్ అయితే ఇప్పుడు అభిమానుల్లో క‌రెంట్ పాస్ చేస్తోంది. ర‌జినీ లుక్ సినిమాపై అంచ‌నాలు ఆకాశానికి తీసుకెళ్ళింది. జులై 22న ఏకంగా 5000 థియేట‌ర్స్ లో విడుద‌ల కానుంది. ఓవ‌ర్సీస్ లో అయితే ఏకంగా 400 స్క్రీన్స్ లో విడుల‌వుతున్న తొలి సౌత్ ఇండియ‌న్ సినిమా ఇది. మొత్తానికి ఇక చూడాలి.. క‌బాలి సృష్టించే సంచ‌ల‌నాలు ఎలా ఉండ‌బోతున్నాయో..