కర్నాటకలో బిజెపి తరపున పవన్ పర్యటన

ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, ఆయన కార్యవర్గాన్ని ఢిల్లీ నుంచి వచ్చిన నరేంద్రమోడి గారి ప్రతినిధులు, తెలంగాణ రాష్ట్ర బిజెపి ఆధ్యక్షులు కిషన్ రెడ్డి, సీమాంధ్ర బిజెపి ముఖ్య ప్రతినిధులు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత కార్యాలయంలో భేటీ అయ్యారు. 

దాదాపు గంటన్న భేటీ అనంతరం రెండు ప్రాంతాల ప్రజల శ్రేయస్సుకు సంబంధించిన కొన్ని ముఖ్య అంశాలు, సున్నితమైన మత, ప్రాంతీయ అంశాలు కూడా చర్చలోకి వచ్చాయి. జనసేన అధ్యక్షులు మతానికి, ప్రాంతాలకు అతీతంగా అందరికీ న్యాయం చేయగలరన్న స్పష్టమైన హామీ అనంతరం బిజెపి నిర్వహించే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనటానికి జనసేన పార్టీ కార్యవర్గం నిర్ణయించింది. పాల్గొనబోయే ప్రచార సభల వివరాలు

బిజెపి – కర్ణాటక (రిజర్వుడు పార్లమెంట్ నియోజకవర్గాలు)

1 కోలార్ – ఎస్.సి – శ్రీ నారాయణ స్వామి

2. రాయచూర్ – ఎస్.టి – శ్రీ శివన్న గౌడ్ నాయక్

3. గుల్బర్గా – ఎస్.సి – శ్రీ రేవు నాయక్ భేలంగి

ఈ ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటనను జనసేన పార్టీ తరపున మారిశెట్టి రాఘవయ్య, మహ్మద్ అబ్దుల్ హనీఫ్, నేమూరి శంకర్ గౌడ్, బొంగునూరి మహీందర్ రెడ్డి, షేక్ రియాజ్, పర్దీపూర్ నరసింహ, మాతం నగేష్, యాది రెడ్డి దామోదర్ రెడ్డిలు సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్నారు.