చైతు లైఫ్‌ను లైలా టర్న్ చేస్తోందట

అక్కినేని నాగచైతన్య – కొండా విజయ్‌కుమార్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఒక లైలా కోసం. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున ఈ సినిమాను స్వయంగా నిర్మించారు. నాగచైతన్య – పూజాహెగ్డే జంటగా నటించారు. ఎన్నో వాయిదాల అనంతరం ఈ సినిమాను అక్టోబర్ 17న భారీగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమా గురించి తెలిసిన వారు ఖచ్చితంగా హిట్ కొడుతుందని, లవ్ స్టోరీల్లోనే ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అంటున్నారు. 

ఈ సినిమా షూటింగ్‌ను చూసిన నాగ్ దర్శకుడిపై నమ్మకంతో సినిమాకు బడ్జెట్‌ను మరింత పెంచారని సమాచారం. అలా రెండు సార్లు సినిమా ఖచ్చితంగా హిట్ కొడుతుందన్న నమ్మకంతో నాగ్ బడ్జెట్ పెంచాడని అంటున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఆడియోకు మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా ఖచ్చితంగా చైతు లైఫ్‌ను టర్న్ చేస్తుందని అంటున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. సినిమా డైలాగులు కూడా కుర్రకారును గిలిగింతలు పెట్టించేస్తున్నాయి. ఇటీవలే ట్రిఫుల్ ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ కూడా జరుపుకుంది.