నరేష్, వీరభద్రమ్ బిస్కెట్ రాజా

అల్లరి నరేష్, వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో ఆహానా పెళ్లంట వంటి హిట్ చిత్రం వచ్చింది. ఇప్పుడు మరోసారి వీరభద్రమ్ దర్శకత్వంలో నటించేందుకు నరేష్ ఒప్పుకున్నాడు. ఈ చిత్రానికి బిస్కెట్ రాజా అనే ఇంట్రస్టింగ్ టైటిల్ పెట్టారు. ఇప్పటికే కథా చర్చలు ముగిశాయి. స్క్రిప్ట్ ఫైనల్ దశకు చేరుకుంది. జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మించే ఈ చిత్రం షూటింగ్ మేలో ప్రారంభమౌతుంది. 

భాయ్ పరాజయం తర్వాత వీరభద్రమ్ కు అవకాశాలు ఆశించనంతగా రాలేదు. పెద్ద హీరోలు పట్టించుకోలేదు. దీంతో తన తొలి హీరో నరేష్ ను సంప్రదించాడు. కథ బాగా నచ్చడంతో నరేష్ ఒప్పేసుకున్నాడు. హీరోయిన్ ను ఇంకా ఫైనల్ చేయలేదు.