నాగార్జున నిర్మాతగా శ్రీకాంత్ కొడుకు డెబ్యూ మూవీ..!

టాలీవుడ్‌లో హీరో శ్రీకాంత్ తనకంటూ ఓ ప్రత్యేకమైన ప్రస్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. హీరోగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన శ్రీకాంత్ హీరోయిన్ ఊహను లవ్ చేసి పెళ్లాడాడు. వీరి కుమారుడు రోషన్ త్వరలోనే టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు.

రోషన్ డెబ్యూ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నట్టు సమాచారం. టీనేజ్ లవ్‌స్టోరీతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఇప్పటికే అన్న పూర్ణ స్టూడియో పక్క పక్కనే, నిర్మలా కాన్వెంట్ అనే టైటిల్స్ రిజిస్టర్ చేయించారు. 

ఆ రెండు టైటిల్స్‌ను నాగార్జున రోషన్ మూవీ కోసమే రిజిస్టర్ చేయించినట్టు ఫిల్మ్‌నగర్ న్యూస్. ఇక రోషన్ గుణశేఖర్ ప్రెస్టేజియస్ మూవీ రుద్రమదేవిలో కీలకపాత్రలో నటించాడు. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. ఇప్పటికే రోషన్ కోసం నాలుగైదు టీనేజ్ లవ్‌స్టోరీలు రెఢీగా ఉన్నాయట.