నారా రోహిత్‌తో పెట్టుకుంటున్న సంపూర్ణేష్

ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ పోరులో మొత్తం నాలుగు చిన్న సినిమాలో పోటీ పడుతున్నాయి. వీటిలో నారా రోహిత్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన అసురతో పాటు బర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్‌బాబు నటించిన సింగం 123 మధ్యే ప్రధానపోటీ నెలకొంది. 

నారా రోహిత్ నిర్మాత వ్యవహరిస్తున్న అసుర సినిమా ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో భారీగా రిలీజ్ చేస్తున్నారు. అలాగే 24 ఫ్రేమ్స్ బ్యానర్‌పై మంచు విష్ణు నిర్మాతగా అక్షత్‌శర్మ డైరెక్షన్‌లో రూపొందిన సింగం 123 సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో మంచు విష్ణు స్టోరీ రైటర్, స్క్రీన్‌ప్లే రైటర్ అవతారం కూడా ఎత్తారు.

బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలతో ఈ నెల 5న వస్తున్న ఈ రెండు హీరోలలో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి. ఇదిలా ఉంటే అదే రోజు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ వెండితెర డెబ్యూ మూవీ ఆంధ్రాపోరితో పాటు మరో చిన్న సినిమా టెన్త్‌లో లక్…ఇంటర్‌లో కిక్..బీటెక్‌లో…? సినిమా కూడా రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండిట్లో ఆంధ్రాపోరిపై కాస్త ఆశలు ఉన్నాయి.