నేనూ నా ప్రేమకథ చెబుతా

బయటకు చెప్పుకున్నా, చెప్పుకోకపోయినా ప్రతి ఒక్కరికీ జీవితంలో ప్రేమ కథ ఉంటుంది. పెళ్లికి ముందు ప్రేమంటే ఏమిటో తెలియని వారు కనీసం పెళ్లి తర్వాతైనా ప్రేమ రుచిని చూసే ఉంటారు. మా సినిమాలోనూ ఓ ప్రేమకథ ఉంది. కాకపోతే పెళ్లికి ముందు జరిగే కథే. ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసి మధ్యతరగతి యువకుడి ప్రేమ కథ ఇది. కోపతాపాలు, ప్రేమముచ్చట్లతో చాలా సహజంగా సాగుతుంది. అంతే స్వచ్ఛంగానూ ఉంటుంది. ఈ ప్రేమ కథను తెరపై తిలకించాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. అని అంటున్నారు. వర్దన్. 

ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా నేను నా ప్రేమకథ. దత్తాత్రేయ ఎంటర్ టైన్ మెంట్స్, శాస్త మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శేఖర్ కథానాయకుడు. సుష్మ నాయిక. వింగ్ కమాండర్ కె.ఎన్.రావు సమర్పిస్తున్నారు. వర్మ, పనుకు రమేష్ బాబు నిర్మాతలు. 

వారు మాట్లాడుతూ… షూటింగ్ మొత్తం పూర్తయింది. అందమైన ప్రేమ కథ ఇది. సినిమా చూస్తుంటే మన పొరుగునే జరిగిందా అన్నంత సహజంగా ఉంటుంది. ప్రేమలో వచ్చే పొరపొచ్చాలు, హీరో హీరోయిన్లు వాటిని ఎలా అధిగమించారు అనేది ఆసక్తికరం. ఖర్చు పెట్టిన ప్రతి పైసా తెరమీద కనిపిస్తుంది. మే మొదటి వారంలో వేగా కంపెనీ ద్వారా పాటల్ని విడుదల చేస్తాం. ప్రస్తుతం డిటియస్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అని అన్నారు. 

ఎం.ఎస్.నారాయణ, ధనరాజ్, అంబటి శ్రీను, విశ్వ ఇతర కీలక పాతల్లో నటించారు.