పెళ్లిని బిజినెస్ గా మార్చేసిన నాగ‌చైత‌న్య‌..

తండ్రికి త‌గ్గ త‌న‌యుడు.. ఇండ‌స్ట్రీలో నాగార్జునను మించిన బిజినెస్ మ్యాన్ మ‌రొక‌రు లేరు. మ‌నం సినిమా స‌మ‌యంలో ఏఎన్నార్ మ‌ర‌ణాన్ని కూడా తెలివిగా త‌న సినిమా కోసం వాడుకున్న బిజినెస్ మైండ్ నాగార్జునది. ఇక ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతోంది. నాగ‌చైత‌న్య కూడా అచ్చం తండ్రి రూట్ లోనే వెళ్తున్నాడు. ఈ హీరో ప్ర‌స్తుతం ప్రేమ‌మ్, సాహ‌సం శ్వాస‌గా సాగిపో సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు రిలీజ్ కు సిద్ధ‌మ‌య్యాయి. ఆగ‌స్ట్ లోనే సాహ‌సం శ్వాస‌గా సాగిపో సినిమా విడుద‌ల కానుంది.
ఇక ఇప్పుడు ప్రేమ‌మ్ విష‌యంలో త‌నదైన ప‌ర్ ఫెక్ట్ స్ట్రాట‌జీ ఫాలో అవుతున్నాడు చైతూ. సెప్టెంబ‌ర్ లో ప్రేమ‌మ్ విడుద‌ల కానుంది. ఇదే నెల‌లో నాగ‌చైత‌న్య ఎంగేజ్ మెంట్ కూడా జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే నాగార్జున‌కు ఈ విష‌యంలో టైమ్ లైన్ కూడా పెట్టాడు నాగ‌చైత‌న్య‌. త‌న నిశ్చితార్థం సెప్టెంబ‌ర్ లో చేయాల‌ని ప‌ట్టుప‌డుతున్నాడు చైతూ. ఆ నెల‌లో ఎంగేజ్ మెంట్ చేస్తే.. ప్రేమమ్ సినిమా ప్ర‌మోష‌న్ కు కూడా ప‌నికొస్తుంద‌ని భావిస్తున్నాడు చైతూ. ఎంగేజ్ మెంట్ తో పాటు సినిమా రిలీజ్ అయితే సినిమాపై క్రేజ్ పెరుగుతుంద‌ని భావిస్తున్నాడు నాగ‌చైత‌న్య‌. ఈ ఇద్ద‌రి పెళ్లి సెప్టెంబ‌ర్ 23న నొవెట‌ల్ లో జ‌రగ‌నుంద‌ని స‌మాచారం. ఇప్ప‌టికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జ‌రుగుతున్నాయి.