ప్రభాస్‌పై మోహన్‌బాబు అలక…బావ నువ్వు తప్పు చేశావ్

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌పై కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు అలకబూనారు. మోహన్‌బాబు రెండో కుమారుడు మనోజ్ వివాహం బుధవారం హైటెక్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభాస్ చాలా ఆలస్యంగా వచ్చారు. ప్రభాస్‌ను రిసీవ్ చేసుకునేందుకు వెళ్లిన మోహన్‌బాబు అలకబూనారు.

ఇంత ఆలస్యంగా రావడమేంటి…ఇంట్లో వాళ్లు ఎందుకు రాలేదని మోహన్‌బాబు ఫీల్ అయ్యారట. బావ తప్పుచేశావ్ ఇంత ఆలస్యంగానా వచ్చేది… అని మోహన్‌బాబు అనడంతో వెంటనే ప్రభాస్ సారీ డార్లింగ్ అని మోహన్‌బాబును వాటేసుకుని ఆప్యాయంగా ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటారట.

గతంలో బుజ్జిగాడు సినిమాలో నటించినప్పటి నుంచి ప్రభాస్-మోహన్‌బాబు మధ్య మంచి అనుబంధం నెలకొంది. అలాగే మోహన్‌బాబు-రెబల్‌స్టార్ కృష్ణంరాజు స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.