బ్రహ్మోత్సవ వైభవం చిలుకూరి బాలాజీ

ప్రమఖ నిర్మాణ సంస్థ ఈటీవీ మరియు ఫిల్మీడియా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిలుకూరి బాలాజీ తుది మెరుగులు దిద్దుకుంటోంది. సాయికుమార్ మాధవుడిగా, ఎస్పీబాలసుబ్రహ్మణ్యం తిరుమల దాసుగా, లవకుశ నాగరాజు అర్చనస్వామి గోవింద్ రాజుగా, నటిస్తున్న ఈ చిత్రంలో చిలుకూరి బాలాజీగా బాపు రాధాకళ్యాణం ఫేం సునీల్ శర్మ, లక్ష్మీ దేవిగా ఉత్తమ నటి ఆమని, మాధవుడి సతీమణిగా అల్లు అర్జున్ వరుడు ఫేం భానుశ్రీ మెహ్రా నటిస్తున్నారు. అర్జున శర్మ అందించిన సంగీతం, శ్రీనివాస్ కూనిరెడ్డి ఛాయాగ్రహణం సినిమాకు హైలైట్స్. ఎన్నో పౌరాణిక చిత్రాలకు దర్శకత్వం వహించిన అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో ఈ చిత్రం అద్భుతంగా రూపుదిద్దుకుంది. అజయ్ శాంతి స్క్రీన్ ప్లే అందించారు. 

మగధీర, రుద్రమదేవి వంటి సినిమాలకు పనిచేసిన మైండ్ విజన్ సంస్థ ఈ చిత్రానికి గ్రాఫిక్స్ అందిస్తోంది. ఈ చిత్రం ఆడియోను మే నెలలో విడుదల చేసి జూన్ మొదటి వారంలో సినిమా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు.