మహేష్ కొరటాల మైత్రి ఫిలింస్ చిత్రం జులైలో

సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా మిర్చి ఫేం కొరటాల శివ దర్శకత్వంలో జూలైలో ఓ భారీ చిత్రం ప్రారంభం అవుతుంది. ఓవర్సీస్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ని విడుదల చేసిన సక్సెస్ ఫుల్ డిస్ట్రిబ్యూటర్స్, చిత్ర నిర్మాణం పట్ల ఎంతో ప్యాషన్ ఉన్న మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్ (తమ్ముడు), సివిఎమ్(మోహన్) ఈ ప్రెస్టీజియస్ మూవీని నిర్మిస్తున్నారు. ఈ వార్తను అధికారికంగా సూపర్ స్టార్ మహేష్, దర్శకులు కొరటాల శివ, మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు చెప్పారు. 

ఈ చిత్రం గురించి సూపర్ స్టార్ మహేష్ మాట్లాడుతూ… కొరటాల శివ  చెప్పిన స్టోరీ ఎంతో ఎక్జైటింగ్ గా ఉంది. మా కాంబినేషన్లో ఇది మంచి కమర్షియల్ ఫిలిం అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ బేనర్ లో ఈ చిత్ర నిర్మాణం అవుతుంది. అని అన్నారు. 

దర్శకులు కొరటాల శివ మాట్లాడుతూ… దర్శకుడిగా నా రెండో చిత్రమే సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. మంచి అభిరుచి ఉన్న నిర్మాతలు నవీన్, రవిశంకర్, సివిఎమ్ ఈ చిత్రాన్ని కాంప్రమైజ్ అవకుండా నిర్మించడానికి ప్లాన్ చేశారు. యూత్, ఫ్యామిలీస్, క్లాస్, మాస్ అందిరినీ ఆకట్టుకునే అంశాలు ఈ కథలో ఉన్నాయి. యూనివర్శల్ అప్పీల్ ఉన్న ఈ సబ్జెక్ట్ మహేష్ బాబుకి హండ్రెడ్ పర్సంట్ పర్ ఫెక్ట్ గా ఉంటుంది. మహేష్ బాబుగారి ఫ్యాన్స్ మెచ్చే అన్ని ఎలిమెంట్స్ మిక్స్ అయిన ఈ సినిమాలో మరెన్నో విశేషాలుంటాయి. అన్నారు. 

నిర్మాతలు మాట్లాడుతూ…. మా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే తొలి చిత్రమే సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మాకు ఇచ్చిన అపూర్వ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎంతో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాం. జూలైలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే ఈ చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు గారి అభిమానుల్ని, ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించేలా ఉంటుంది. అన్నారు. 

మైత్రి మూవీ మేకర్స్ తొలి చిత్రంగా నిర్మాణం అవుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి 

సంగీతం – దేవిశ్రీ ప్రసాద్

ఫొటోగ్రఫీ – మది

ఫైట్స్ – అరసు

ఆర్ట్ – ఎ.ఎస్.ప్రకాష్

ఎడిటింగ్ – కోటగిరి వెంకటేశ్వరరావు

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – అశోక్