విశాల్ ఇంద్రుడు పాటలొచ్చేశాయ్

విశాల్, లక్ష్మీ మీనన్ జంటగా తమిళంలో నటించిన చిత్రాన్ని తెలుగులో ఇంద్రుడు పేరుతో విడుదల చేస్తున్నారు. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతమందించిన ఈ చిత్ర పాటలు విడుదలయ్యాయి. తిరు ఈ చిత్రానికి దర్శకుడు. యూటీవీ మోషన్ పిక్చర్స్, విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్లో సిద్ధార్థ్ రాయ్ కపూర్, విశాల్ కృష్ణ నిర్మించారు. వనమాలి, సాహితి, వెన్నెలకంటి పాటలు రాశారు. ఈనెల 25న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

విశాల్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ… ఇందులో నేను నార్కొలెప్సీ అనే వ్యాధితో బాధపడుతుంటాను. అంటే భావోద్వేగానికి గురైనప్పుడు నిద్రపోతాను. ఇలాంటి వ్యాధి ఉంటుందని నాకు ముందు తెలీదు. యూట్యూబ్ లో చూసి తెలుసుకున్నాను. వారిని తొందర్లోనే కలవబోతున్నాను. నాలుగు నెలల్లో కంప్లీట్ చేసి విడుదల చేశాం. తమిళంలో విడుదలై మంచి విజయం సాధించింది. తెలుగులోనూ మంచి రిజల్ట్ వస్తుంది ఆశిస్తున్నాను. అని అన్నారు.