వెండితెర మరువని దార్శనికుడు కె.బాలచందర్

వెండితెర మరువని దార్శనికుడు కె.బాలచందర్
మనం కొన్ని సినిమాలు చూస్తాం.బాగున్నాయి అనుకుంటాం.తర్వాత వాటి గురించి మర్చిపోతాం.మరికొన్ని సినిమాలు అలా కాదు.సినిమా చూస్తూన్నంత సేపూ గొప్ప అనుభూతికి లోనవుతాం.చూసిన తర్వాత కూడా ఆ పాత్రలు,ఆ కథ ,ఆ సన్నివేశాలు మనలని వెంటాడుతూ వుంటాయి.మనం మళ్లీ మళ్లీ చూడాలనుకుంటాం.కొన్ని రోజులు కాదు,నెలలు కాదు..ఎన్ని ఏళ్లయినా అవి మన మనసు లో అలాగే స్థిరంగా వుండిపోతాయి.సరిగ్గా ఇలాంటి సినిమాలనే తీశారు కె.బాలచందర్‌.

కె.బాలచందర్‌..ఆ పేరు వినగానే మన ముందు ఎన్నో జీవితాలు కదలాడుతాయి.అవును..ఆయన తీసిన సినిమాలు  జీవితం నుంచి తీసుకున్న నిజమైన గాధలే…అనుక్షణం మన కళ్ల ముందు కదులుతున్న జీవితాలనే ఆయన సినిమాలు గా తీశాడు.జీవితంలోని వాస్తవాలను ఆయన ఆవిష్కరించినట్టుగా సినిమాలలో మరే దర్శకుడూ ఆవిష్కరించలేదు.స్త్రీ అంతరంగాన్ని లోతుగా చదివిన దర్శకుడీయన.వివాహ బంధం లో వున్న పురుషాధిపత్యాన్ని తన సినిమాల్లో కళ్లకు కట్టినట్టు చూపిన యదార్థవాది బాలచందర్‌.విప్లవాత్మక ఆలోచనా ధోరణి,మనసు అంతరగాలను దర్శించగల సునిశిత దృష్టి.కె.బాలచందర్‌ ని వెండితెర పై మరపురాని చిత్రాల దర్శకుడిని చేశాయి.

సత్యజిత్ రే,మృణాల్ సేన్‌,శ్యాంబెనెగళ్‌ వంటి దర్శకులు పూర్తి గా ఆర్ట్‌ సినిమాలు తీస్తున్న సమయంలో అటు కమర్షియల్ సినిమాకు,ఇటు సమాంతర చిత్రాలకు  మధ్యన తనదైన సరికొత్త మార్గాన సినిమాలు తీసారు బాలచందర్‌.మహిళా ప్రధాన చిత్రాలు తీసినా,ప్రేమ కథా చిత్రాలు తీసినా,సందేశాత్మక చిత్రాలు తీసినా.. కె.బాలచందర్‌ భారతీయ సినిమా పై ఓ ప్రత్యేకమైన ముద్రను వేశారు.

బాలచందర్‌ సినిమాలు చూసిన ప్రతిసారీ ఏదో ఓ కొత్త కోణం కనిపిస్తుంది.గొప్ప కధకుడికి ఉండే లక్షణం ఇది.అడుగడుగునా మారుతున్న పరిస్థితులకు సున్నితమైన స్త్రీ హృదయం ఎలా స్ఫందిస్తుందో గుండెలో భావాలను తట్టిలేపేలా చెప్పాడు బాలచందర్‌.అయన తీసిన ఇది కథ కాదు సినిమా స్టార్టింగ్ లో చలం రాసిన ఓ కొటేషన్‌ తో సినిమా స్టార్ట్ అవుతుంది.తమిళుడైన బాలచందర్‌ తెలుగు రచయిత చలం ని కోట్ చేయటం తో  సమకాలీన రచనలు,రచయితల పట్ల ఆయనకున్న నాలెడ్జ్‌ ఏ పాటిదో మనం అర్ధం చేసుకోవచ్చు.
అందరు కమర్షల్ సినిమాలు చేస్తు దుసుకుపోతుంటే నేను మాత్రం సమాజాన్ని ప్రతిభంభించే సినిమాలే చేస్తాను అంటు సినిమాలకు కొత్త రుపం తీసుకొచ్చిన లెజండరీ డైరెక్టర్.బాలచందర్‌  సినిమాల్లో హీరోలు హీరోయిన్లు ఉండరు..నిజజీవిత పాత్రలే ఉంటాయి.ఢిఫరెంట్ సినిమాలతో మధ్య తరగతి కుటుంబాలను అకట్టుకున బాలచందర్ ఎన్నో అణిముత్యలను తీశారు.దేశం లో దరిద్రాన్ని చూపిస్తూ, ఆకలి బాధ ను అప్పటి దేశ పరిస్థితికి అద్దం పట్టిన సినిమా ఆకలిరాజ్యం.ఈ సినిమా లో హీరో కు అతని తండ్రి క్యారెక్టర్ కీ మధ్య ఆలోచనాల విధానాల లోని అంతరాన్ని బాలచందర్‌ చెప్పిన తీరు అద్బుతం.ఈ సినిమా లో శ్రీ శ్రీ కవితలు వినిపిస్తాయి. తమిళ దర్శకుడైన బాలచందర్‌ కు సమకాలీన సాహిత్యం పై పూర్తి అవగాహన ఉందనటానికి ఇదొక నిదర్శనం.

మంచి సినిమాలు తీయ్యడయే సాహసం అనుకుంటున్న టైంలో ట్రెండ్ సెట్ చేసే సినిమాలు బాలచందర్ డైరెక్ట్ చేశారు.రుద్రవీణ,మరో చరిత్ర, ఇలా చెప్పుకుంటు పోతే అయన తీసిన అణిముత్యలకు అంతం లేదనే చెప్పాలి..తన దైన స్టైల్ మేకింగ్ తో ఎంతో మంది డైరెక్టర్లకు ఆదర్శంగా మారాడు.ఏ ప్రయోజనం లేని కళా సేవ కన్నా తోటివారికి సాయపడటం గొప్పవిషయం అని చాటి చెప్పిన సినిమా రుద్రవీణ.స్వతహా బ్రాహ్మణుడైన బాలచందర్‌ ఈ సినిమా లో బ్రాహ్మణ కుటుంబాల లో వుండే ఛాందస భావాలను ఖండించాడు.

భారత దేశం గర్వించదగ్గ దర్శకుడైన బాలచందర్‌ కు ఓ రకంగా చెప్పాలంటే నేషనల్ స్థాయి లో రావలసినంత గుర్తింపు రాలేదు.బాలచందర్‌  తీసిన సినిమాలలో 6 సినిమాలకు  ఉత్తమ ప్రాంతీయ చిత్రం కేటగిరీ లో నేషనల్ అవార్డ్‌ లభించింది.సినిమా ద్వారా తను చేసిన కళాసేవ కు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1987 లో కె.బాలచందర్‌ ను పద్మ శ్రీ అవార్డు తో సత్కరించింది.బాలచందర్ తన సినిమాల తో ఇద్దరు స్టార్ హీరోలను వెండితెరకు పరిచయం చేశారు.కమలహాసన్‌, రజనీకాంత్.వీరిద్దరినీ అపూర్వ రాగంగల్ తో వెండి తెరకు ఇంట్రడ్యూస్‌ చేశారు బాలచందర్‌.వీరిద్దరి కాంబినేషన్‌ లో ఎక్కువ సినిమాలు చేసిన దర్శకుడు కూడా కె.బాలచందరే.అలనాటి తారలు జయప్రద,శ్రీదేవీ,సరిత,జయసుధ,సుజాత లను వెండి తెరకు ఇంట్రడ్యూస్‌ చేసింది కె.బాలచందరే. భారత చలనచిత్ర రంగం అభివృద్ధికి ఆయన చేసిన కృషికి గాను 2010 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించింది.