స‌మంత‌, చైతూ పెళ్లి తేదీ ఖ‌రారు..

టాలీవుడ్ లో కొన్ని రోజుల నుంచి వినిపిస్తోన్న వార్త నాగ‌చైత‌న్య‌-స‌మంత పెళ్లి. వీళ్లిద్ద‌రూ ప్రేమ‌లో ఉన్నార‌నే విష‌యం తెలుసు. కొంత‌కాలంగా అంద‌రికీ తెలిసేలా త‌మ బంధాన్ని బ‌య‌ట‌పెట్టారు ఈ జంట‌. కానీ పెళ్లి విష‌యంపై మాత్రం నోరు విప్ప‌లేదు. స‌మంత కాస్త హింట్ ఇచ్చింది కానీ చైతూ మాత్రం అస్స‌లు మాట్లాడ‌లేదు. అయితే ఇప్పుడు వీళ్ల బంధానికి క్లైమాక్స్ వ‌చ్చేసిన‌ట్లు తెలుస్తోంది. నాగ‌చైత‌న్య‌తో స‌మంత ఏడ‌డుగులు న‌డ‌వ‌టానికి డేట్, టైమ్ ఫిక్స్ అయింది. ఈ ఏడాదే వాళ్లిద్ద‌రూ పెళ్లి చేసుకోబోతున్నారు.
ఇప్ప‌టికే చైతూ పెళ్లికి నాగార్జున ఓకే చెప్పాడు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా నాగార్జునే ఆ మ‌ధ్య ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పాడు. ఇక నాగ‌చైత‌న్య కూడా ప్రేమమ్ షూటింగ్ ను వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని చూస్తున్నాడు. మ‌రోవైపు స‌మంత కొత్త సినిమాలేవీ ఒప్పుకోవ‌డం లేదు. ప్ర‌స్తుతం న‌టిస్తున్న జ‌న‌తా గ్యారేజ్ షూటింగ్ కూడా చివ‌రి ద‌శ‌కు వ‌చ్చేసింది. ఈ సినిమా త‌ర్వాత స‌మంత పెళ్లి ప‌నుల్లో బిజీ కానుంది. ఇప్ప‌టికే త‌న ట్విట్ట‌ర్ లో రోజుకో విధంగా పెళ్లి గురించి చెబుతోంది స‌మంత‌. వీళ్లిద్ద‌రి పెళ్లి సెప్టెంబ‌ర్ 23న హైద‌రాబాద్ లోనే జ‌ర‌గ‌నుంది. నోవెట‌ల్ హోటెల్ లో అక్కినేని వారి అబ్బాయి పెళ్లి అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌ట్నుంచే ఈ పెళ్లిపై అంద‌ర్లోనూ ఆస‌క్తి నెల‌కొంది.