రెండు వేల కోట్ల బ్లాక్ మనీ తో వస్తున్న పవన్

2000 క్రోర్ బ్లాక్ మనీ సినిమా యూనిట్ ప్రెస్ మీట్ మంగళ వారం హైదరాబాద్ లో జరిగింది . నిర్మాత పవన్ రెడ్డి మాట్లాడుతూ జూలై 3 న ఈ చిత్రాన్ని రాష్ట్ర వ్యాప్తంగ విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు . ఇటీవలే విడుదలైన పాటలకి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. సినిమా గురించి తెలుపుతూ ఒక కాన్సెప్ట్ బేస్డ్ మూవీ అని , స్టూడెంట్స్ , పాలిటిక్స్ , పోలీస్,, ల మధ్య జరిగే మైండ్ గేమ్, చాల సస్పెన్స్ తో నడుస్తూ ఆసక్తికరంగా ఉంటుందని తెలిపారు.

విదుదలైన మొదటి అట కి ఒక కాంటెస్ట్ ఉంటుందని , ఇంటర్వెల్ సమయం లో వచ్చే సస్పెన్సు ని కరెక్ట్ గ చెప్పగలిగితే  1000 రూపాయలు గెలుచుకోవచని తెలిపారు.ఈ కాంటెస్ట్ విషయాలను త్వరలో వివరిస్తామని తెలిపారు. ఇందులో పవన్ రెడ్డి , సిద్దార్థ్, అంజలి రావు,సునీల్,సీనీమ్యక్ష్  లక్ష్మన్ , వరంగల్ భాషా తదితరులు  నటించారు . దర్శకత్వం రమేష్ ముక్కెర , సినిమాటోగ్రఫి దివ్య & ఉదయ్ , ఎడిటర్ గోపి , నిర్వహణ జనార్ధన్ రెడ్డి , నిర్మాతః పవన్ రెడ్డి.