మంత్రాలయం తుంగభద్ర నదిలో 4 మృతదేహాలు

కర్నూలు జిల్లా మంత్రాలయం దగ్గర తుంగభద్ర నదిలో నాలుగు మృతదేహాల్ని పోలీసులు కనుగొన్నారు. వీరికి తీవ్ర గాయలై ఉన్నాయి. హత్య చేసి నదిలో పారవేసి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. వీరిలో ఓ మహిళ కూడా ఉండడం విశేషం. అయితే వీరు ఎవరు అనేది పోలీసు విచారణలో తెలుసుకుంటామని మంత్రాలయం పోలీసులు చెబుతున్నారు. వీరంతా ఒకే కుటంబం వారా లేక వేరు వేరు కుటుంబాల వాళ్లా. వీరందరికి ఎలాంటి రిలేషన్ ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.