ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి మా `4 లెట‌ర్స్` సినిమా అంకితం – నిర్మాత ఉద‌య్ కుమార్ దొమ్మ‌రాజు

ప్ర‌స్తుతం తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో కొత్త తీరు తో పాటు కొత్త నీరు కూడా ప్ర‌వ‌హిస్తోంది. గ‌త ఏడాది చూస్తే కొత్త ద‌ర్శ‌కులు, కొత్త హీరోల‌దే హ‌వా న‌డిచింది. ఈ ఏడు కూడా కొత్త నీరు జోరుగా ప్ర‌వ‌హించ‌నుంది. ఆ కోవ‌లో ఈశ్వ‌ర్ అనే కొత్త కుర్రాడు `4 లెట‌ర్స్` అనే సినిమా ద్వారా హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. తండ్రి డాక్ట‌ర్ అవుతావా అన్నాడు…లేదు యాక్ట‌ర్ అవుతా అన్నాడు….కొడుకు ఇష్ట‌మే…త‌న ఇష్టంగా….భావిస్తూ త‌నే నిర్మాత‌గా మారి ఓం శ్రీ చ‌క్ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ స్థాపించి ప్రొడ‌క్ష‌న్ నెం.1గా ఉద‌య్ కుమార్ దొమ్మ‌రాజు , ఏ. ర‌ఘురాజ్ ద‌ర్శ‌క‌త్వంలో `4 లెట‌ర్స్` చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల‌లోనే విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా నిర్మాత ఉద‌య్ కుమార్ దొమ్మ‌రాజు మీడియాతో ముచ్చ‌టించారు…ఆ విశేషాలు…* మాది తిరుప‌తి. చెన్నై లో మాస్ట‌ర్స్ ఇన్ ఎన్విరాన్మెంటల్ ఇంజ‌నీరింగ్ చేశాను. ఆ త‌ర్వాత సిపిడ‌బ్ల్యూడి( సెంట్ర‌ల్ పబ్లిక్ వ‌ర్క్స్ డెవ‌ల‌ప్ మెంట్ డిపార్ట్ మెంట్)లో మూడేళ్లు సివిల్ ఇంజ‌నీర్ గా పని చేసి 1997లో అమెరికా వెళ్ళాను. దాదాపు గా 21 ఏళ్లుగా న్యూయార్క్ సిటీలో ఉంటున్నాను. వృత్తి ప‌రంగా న్యూయార్క్ సిటీ డిపార్ట్ మెంట్ ఆఫ్ ట్రాన్స్ పోర్టేష‌న్ లో డైర‌క్ట‌ర్ గా ప‌ని చేస్తున్నాను. నా వృత్తి ప‌రంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక నా ఫ్యామిలీ విష‌యానికొస్తే… నా వైఫ్ పేరు హేమ‌ల‌త. మాకిద్ద‌రు పిల్ల‌లు ఈశ్వ‌ర్ , దివ్య. మా ఫ్యామిలీ అంద‌రికీ సినిమాల‌న్నా , సంగీతమ‌న్నా చాలా ఇష్టం.
* చాలా కాలం క్రితం మా నాన్న‌గారు సినిమాలు నిర్మించాల‌ని చెన్నై వెళ్లారు. అలా మా ఫ్యామిలీకి సినిమా ఫీల్డ్ తో సంబంధాలు ఉన్నాయి. కానీ మా నాన్న‌గారు దాన్ని కంటిన్యూ చేయ‌లేక‌పోయారు. నేను కూడా సినిమాల‌పై పెద్ద గా దృష్టి పెట్ట‌లేదు.

* మా అబ్బాయి ఈశ్వ‌ర్ కి చిన్న‌ప్ప‌టి నుంచి సినిమాలంటే చాలా ఇంట్ర‌స్ట్ . అలాగే మ్యూజిక్ అంటే కూడా ఎంతో ఆస‌క్తి. అలా క‌ర్ణాట‌క వోక‌ల్ నేర్చుకున్నాడు. త‌బ‌ల‌, ఫ్లూట్, ప్లే చేస్తాడు. మంచి సింగ‌ర్ కూడా. నాటా ఐడ‌ల్ ప్రొగ్రామ్స్ లో చాలా సార్లు పార్టిసిపేట్ చేశాడు. న్యూయార్క్ లో ఉన్న తెలుగు అసోసియేష‌న్ లో మా పిల్ల‌లిద్ద‌రూ చాలా యాక్టివ్ గా ఉంటూ ఎన్నో క‌ల్చ‌ర‌ల్ ప్రొగ్రామ్స్ చేసేవారు. మా అమ్మాయి దివ్య న్యూయార్క్ సిటీలో పదేళ్ల పాటు భ‌ర‌తనాట్యంలో శిక్ష‌ణ తీసుకుంది. 2016 అగ‌స్టులో తిరుప‌తిలోని మ‌హ‌తి ఆడిటోరియంలో భ‌ర‌తనాట్య ప్ర‌ద‌ర్శ‌నిచ్చి… ఆ కార్య‌క్ర‌మానికి అతిథిగా విచ్చేసిన ప్ర‌ముఖ‌న‌టి, క్లాసిక‌ల్ డాన్స‌ర్ మంజు భార్గ‌వి ప్ర‌శంస‌లు పొంద‌డం విశేషం. అలా ఈశ్వ‌ర్ కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తుండ‌టంతో స్టేజ్ ఫియ‌ర్ అనేది పోయింది. ఇలాంటి క్ర‌మంలో మూడేళ్ల క్రితం యాక్టింగ్ పై ఇంట్ర‌స్ట్ ఉంద‌ని చెప్పాడు. అప్పుడే వైజాగ్ కి చెందిన మిత్రుడొక‌రు స‌త్యానంద్ గారు అని ఒక‌రు ఉన్నారు. ఎంతో మంది పెద్ద హీరోల‌కు సైతం యాక్టింగ్ నేర్పించారు. వారి ద‌గ్గ‌ర‌కు పంపించండి అని చెప్పారు. అలా వైజాగ్ స‌త్యానంద్ గారిని సంప్ర‌దించ‌డం, వారి వ‌ద్ద యాక్టింగ్ లో శిక్ష‌ణ ఇప్పించడం జ‌రిగాయి. స‌త్యానంద్ గారు కూడా ఎంతో కేర్ తీసుకుని యాక్టింగ్ నేర్పించారు. “ఈశ్వ‌ర్ లో మంచి యాక్ట‌ర్ ఉన్నాడు, సినిమాప‌ట్ల ఎంతో పాష‌న్ కూడా ఉంది . త‌న‌ని హీరోగా పెట్టి సినిమా తీయొచ్చు“ అని స‌త్యానంద్ గారు చెప్ప‌డంతో …మాకు ఈశ్వ‌ర్ పై మ‌రింత న‌మ్మ‌కం పెరిగింది. లాస్ట్ ఇయ‌ర్ మే లో త‌న డిగ్రీ పూర్త‌యింది. త‌ను ఐదేళ్ల వ‌య‌స్సులోనే అమెరికా వ‌చ్చినా కానీ, తెలుగు చాలా స్ప‌ష్టంగా మాట్లాడ‌గ‌ల‌డు. అలాగే ఈశ్వ‌ర్ యాక్టింగ్ తో పాటు డైర‌క్ష‌న్ చేస్తూ ` ఆ ఇద్ద‌రూ` అనే ఒక షార్ట్ ఫిలిం కూడా చేశాడు. త‌ను డాక్ట‌ర్ కావాల‌న్న‌ది నా కోరిక‌…కానీ త‌ను యాక్ట‌ర్ అవుతా అన్నాడు. ఇక త‌న ఇష్టానికే ప్రాధాన్య‌త ఇస్తూ ఎంక‌రేజ్ చేస్తున్నాం. అందుకే మేమే బేన‌ర్ స్థాపించి ఈశ్వ‌ర్ హీరోగా ` 4 లెట‌ర్స్ ` సినిమా ప్రారంభించాం.

* నిజం చెప్పాలంటే…సినిమా ఫీల్డ్ కు నా ఫీల్డ్ కు అస‌లు సంబంధం లేదు. నేను సివిల్ ఇంజ‌నీర్ ని, న్యూయార్క్ తో పాటు ఇక్క‌డ కూడా ప‌లు సాఫ్ట్ వేర్ బిజినెస్ లు ఉన్నాయి. కానీ సినిమా అంటే ఒక ప్రేక్ష‌కుడుగా తెలుసు త‌ప్ప సినిమా నిర్మాణం పై ఏమాత్రం అవ‌గాహ‌న లేదు. అయినా ఎక్క‌డా ఇబ్బంది లేకుండా సినిమా ప్రారంభించి పూర్తి చేశామంటే మా టీమ్ కే ఆ క్రెడిట్ ద‌క్కుతుంది.
ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్ భాస్క‌ర్ రాజుగారు రఘురాజ్ గారిని ప‌రిచ‌యం చేశారు. `క‌లుసుకోవాల‌ని` సినిమా తెలుగులో పెద్ద స‌క్సెస్ అయింది. ఆ త‌ర్వాత త‌మిళ్, క‌న్న‌డ‌లో చాలా సినిమాలు చేస్తూ బిజీ వ‌ల్ల తెలుగులో సినిమా చేయ‌లేక‌పోయారని తెలుసుకున్నా. అందులో ర‌ఘురాజ్ గారు అబ్రాడ్ వెళ్లి టెక్నిక‌ల్ గా మెరుగ‌వ‌డానికి కొన్ని కోర్సులు చేసారు. వెరీ టాలెంటెడ్ డైర‌క్ట‌ర్. మాకు సినిమా రంగం పై అనుభ‌వం , అవ‌గాహ‌న లేకున్నా…అన్నీ తానై చూసుకున్నారు. మా అబ్బాయితో అద్భుతంగా చేయించారు. మేము డైర‌క్ట‌ర్ ని న‌మ్మి ఈ సినిమా చేశాం.

* మొద‌ట సినిమా రంగం అన‌గానే కొంత మంది మిత్రులు భ‌య‌పెట్టిన మాట వాస్త‌వ‌మే. ఏ రంగంలో అయినా న‌మ్మ‌కం అనేది ముఖ్యం. న‌మ్మ‌కంతో చేస్తే ఎలాంటి ఇబ్బందులు రావు. అలా మా టీమ్ ని న‌మ్మి సినిమా చేశాం. మేం న‌మ్మిన‌ట్టుగానే అంద‌రూ హార్ట్ ఫుల్ గా ప‌ని చేశారు. ఒక మంచి సినిమా ఇచ్చారు.

* మా ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్ భాస్క‌ర్ రాజు, రామ‌కృష్ణ‌, మోహ‌న్ రాజు ఎంతో స‌పోర్ట్ చేశారు. అలాగే నా సొంత త‌మ్ముడు భాస్క‌ర్ రాజు దొమ్మ‌రాజు సినిమా మొత్తం త‌నే చూసుకున్నాడు. ఎక్క‌డా ఏ చిన్న ఇబ్బంది రాకుండా సినిమా కంప్లీట్ అయిందంటే ఆ క్రెడిట్ అంతా నా త‌మ్ముడు భాస్క‌ర్ రాజు కే చెందుతుంది .ఈశ్వ‌ర్ ని త‌న చేతిలో పెట్టాను…నా స్థానంలో ఉంటూ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌న్నీ చాలా బాగా నిర్వ‌హించాడు.

*’4 లెట‌ర్స్` క‌థ‌లో ఇంప్రెస్ చేసిన అంశాల విషయానికి వస్తే… కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే యూత్ పుల్ రొమాంటిక్ కామెడీ చిత్రం `ఫోర్ లెట‌ర్స్`. ఫ్యూర్ యూత్ ఫుల్ ఎంట‌ర్ టైనింగ్ గా ఉంటుంది త‌ప్ప ఎక్క‌డా విల‌నిజం అనేది ఉండ‌దు. ప్ర‌జంట్ యూత్ కి బాగా క‌నెక్ట‌వుతూనే అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే రిలేష‌న్స్, ఎమోష‌న్స్ ఉంటాయి. ఎక్క‌డా డ్రా బ్యాక్ అవ‌కుండా ప్ర‌తి సీన్ ఆక‌ట్టుకునేలా డైర‌క్ట‌ర్ ప్లాన్ చేశారు. సినిమా ఎప్పుడు ప్రారంభ‌మై ఎప్పుడు అయిపోయింది అనేది తెలియ‌దు. ఒక కొత్త హీరో కి యాప్ట్ అయ్యే స్టోరి కావ‌డంతో నేను ఇంప్రెస్ అయ్యాను. నిర్మించ‌డానికి ముందుకొచ్చాను. సినిమా రిలీజ్ అయ్యాక ప్రేక్ష‌కులు మెచ్చేలా మా సినిమా ఉంటుంద‌ని న‌మ్మ‌కంగా చెప్ప‌గ‌ల‌ను.

* ప‌క్కా ప్లానింగ్ వ‌ల్లే షార్ట్ టైమ్ లో సినిమా చేయగ‌లిగాం. ఇది సాధ్య‌మైందంటే…మా ప్రొడ‌క్ష‌న్ డిపార్ట్ మెంట్ మ‌రియు డైర‌క్ష‌న్ టీమ్ వ‌ల్లే. ఒక‌సారి స్క్రిప్ట్ లాక్ చేసాక ఏమాత్రం డిస్ట‌ర్బ్ చేయ‌కుండా షెడ్యూల్ ప్ర‌కారం షూటింగ్ చేసుకుంటూ వెళ్లిపోయాం. షెడ్యూల్ ప్లానింగ్ లో మా డైర‌క్ట‌ర్ చాలా ఎక్స్ ప‌ర్ట్. షూటింగ్ ప్రారంభించాక ఒక్క రోజు కూడా డిలే కాకుండా సినిమా పూర్తి చేసారు. ఆర్టిస్ట్స్ అంద‌రూ కూడా ఎంతో స‌హ‌కరించారు.

*మా సినిమాకు మ్యూజిక్ హైలెట్ గా నిలుస్తుంద‌న‌డంలో సందేహం లేదు. భీమ్స్ సిసిరోలియోగారు ఇచ్చిన‌ నాలుగు అద్భుత‌మైన బాణీల‌కు సురేష్ ఉపాధ్యాయ చ‌క్క‌టి సాహిత్యాన్ని అందించారు. నేప‌థ్య సంగీతం, పాట‌లు సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. ఇటీవ‌ల విడుద‌లైన పాట‌ల‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. అలాగే సినిమాటోగ్ర‌ఫీ కూడా చాలా బాగా కుదిరింది. ఇక మా డైర‌క్ట‌ర్ ర‌ఘరాజ్ గారి డైర‌క్ష‌న్, డైలాగ్స్, ఎడిటింగ్ , క‌థ, క‌థ‌నాలు సినిమాకు ఆయువుప‌ట్టు.

* మా బేన‌ర్ లో వ‌రుస‌గా సినిమాలు చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. మా ఈశ్వ‌ర్ తో పాటు కొత్త వారికి , కొత్త ద‌ర్శ‌కుల‌కీ మంచి స్క్రిప్ట్స్ తో వ‌స్తే అవ‌కాశాలు ఇవ్వాల‌నుకుంటున్నాం.

* ఇటీవ‌లే ఫ‌స్ట్ కాపీ చూసాను. నిజంగా పుత్రోత్సాహం పొందాను. నాతో పాటు చూసిన వారంద‌రూ కూడా ఒక కొత్త హీరోలా కాకుండా ఎంతో అనుభ‌వం ఉన్న హీరోలా న‌టించాడంటున్నారు. డైలాగ్ డెలివ‌రీ కానీ, డాన్స్ ల్లో కానీ అద్భుతంగా చేసాడు. మొద‌టి సినిమాలోనే డ‌బ్బింగ్ చెప్పడంతో పాటు ఒక పాట కూడా పాడాడు.
*మా టైటిల్ మీనింగ్ ఏంట‌నేది ట్యాగ్ లైన్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. సినిమా చూస్తే ఇంకా బాగా అర్థ‌మ‌వుతుంది. 4 లెట‌ర్స్ చూట్టూ సినిమా తిరుగుతుంది. అందుకే ఆ టైటిల్ పెట్టాం. ఫుల్ ఎంట‌ర్ టైన్ మెంట్ తో పాటు అంత‌ర్లీనంగా “యూత్ అనుకుంటే ఏమైనా చేయగ‌ల‌రు“ అనే మెసేజ్ ఇస్తున్నాం అన్నారు నిర్మాత ఉద‌య్ కుమార్ దొమ్మ‌రాజు.