90ML మూవీ రివ్యూ

కార్తికేయకు ప్రస్తుతం మంచి మార్కెట్ ఉంది. విభిన్నమైన కాన్సెప్ట్ సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఈసారి కూడా 90 ఎంఎల్ పేరుతో మరో విభిన్నమైన కథతో మనముందుకు వచ్చాడు. మందు తాగకపోతే ప్రాణమే పోయే పరిస్థితిలో ఉండే కుర్రాడి కథే 90 ఎం.ఎల్. నేహా సోలంకి హీరోయిన్. అశోక్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు శేఖర్ రెడ్డి. అనూప్ రూబెన్స్ సంగీతమందించాడు. ట్రైలర్ తో మంచి అంచనాలు పెంచిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథేంటంటే:
కార్తికేయ (దేవదాస్) కు పుట్టుకతోనే ఓ అరుదైన వ్యాధి ఉంటుంది. దానికి ఉపశమనంగా దేవదాస్ ప్రతిపూటా ఓ 90ఎంఎల్ ఆల్కహాల్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆల్కహాల్ తీసుకోకపోతే ప్రాణాలే పోయేంతటి జబ్బు ఉన్న దేవదాస్, అది అంటేనే అసహ్యంగా భావించే కుటుంబానికి చెందిన సువాసన (నేహా సోలంకి) ప్రేమలో పడతాడు. దేవదాస్ కి మందు తాగే అలవాటున్న విషయం తన దగ్గర దాచాడన్న కోపంతో సువాసన దేవదాస్ ని వదిలి వెళ్ళిపోతుంది. మరి మందు తాగితేనే బ్రతక గల దేవదాస్ సువాసన ప్రేమ కోసం మందు వదిలేశాడా? దేవదాస్ లోపాన్ని అర్థం చేసుకొని సుహాసన అతని ప్రేమను అంగీకరించిందా? చివరికి ఈ యువ జంట ప్రేమ కథ ఎలా ముగిసింది? అనేది తెరపైన చూడాలి.

సమీక్ష
కార్తికేయ ఈ సినిమాలో కొత్తగా కనిపించాడు. విభిన్నమైన మందు కాన్సెప్ట్ కు తగ్గట్టుగా తనను తాను మలచుకున్నాడు. జనరల్ గానే మంచి ఎనర్టీతో ఉండే కార్తికేయ ఇందులో మందు తాగి చేసిన సీన్స్ చాలా బాగా వచ్చాయి. డెరెక్టర్ టైటిల్స్ దగ్గరి నుంచే ప్రేక్షకుల్ని కథలోకి ఇన్ వాల్వ్ చేశాడు. హీరోకున్న ప్రాబ్లం గురించి క్లియర్ గా చెప్పగలిగాడు. దీంతో ప్రేక్షకులకు కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్ గా అనిపిస్తుంది. కామెడీ టైమింగ్ బాగుండడంతో ఆ సీన్స్ కూడా కూడా చాలా బాగా వచ్చాయి. ఎమోషనల్ సన్నివేశాలలో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ పర్ఫెక్ట్ గా కుదిరాయి. కార్తికేయ స్క్రీన్ పై కనిపించిన ప్రతి సన్నివేశం అతని ఎనర్జీ తో ఆహ్లాదంగా ముందుకు సాగుతుంది. ఫిజియో థెరఫిస్ట్ గా హీరోయిన్ నేహా సోలంకి క్యూట్ గా ఉంది. సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సన్నివేశాలలో ఆమె నటన ఆకట్టుకుంటుంది. ప్రేమకు కుటుంబానికి మధ్య నలిగిపోయే అమ్మాయిగా ఆమె ఒదిగిపోయారు. బిగ్ బాస్ రియాలిటీ షో తో ఫేమస్ అయిన రోల్ రిడా కార్తికేయ స్నేహితుడిగా ఫుల్ టైమ్ రోల్ దక్కించుకున్నాడు. కార్తికేయ పక్కన ఉంటూ ఆయన వేసే కామెడీ సెటైర్స్ అక్కడక్కడా పేలాయి. ప్రధాన విలన్ గా రవికిషన్ ఈ చిత్రంలో కచ్చితంగా కొత్తగా ట్రై చేశాడు అని చెప్పాలి. మేల్ ఫిమేల్ కాంబినేషన్ కాస్ట్యూమ్స్ లో ఆయన చేసే కామెడీ మాస్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. కార్తికేయ తల్లిదండ్రులుగా చేసిన ప్రగతి, సత్య ప్రకాష్ లు తమ పరిధిలో చక్కని నటన కనబరిచారు. రావు రమేష్ ఎప్పటిలాగే తన మార్కు నటనతో అలరిస్తారు. మందు తాగకుంటే ప్రాణాలు పోయే వ్యాధి వున్న పాత్రను హీరోగా తీసుకొని దానికి ప్రేమతో ముడిపెట్టి కొత్తగా చెప్పాలనుకున్నాడు దర్శకుడు. ఈ విషయాన్ని బాగా ఎగ్జిక్యూట్ చేయగలిగాడు. ముఖ్యంగా రవికిషన్ హీరోకు మధ్య వచ్చే సీన్స్ ఫన్నీగా సాగాయి. ప్రవీణ్ కొద్దిసేపే ఉన్నా నవ్వించగలిగాడు. యాక్షన్ పార్ట్ ని సైతం బాగా డిజైన్ చేయగలిగాడు. ఇంటర్వెల్ బ్లాక్ ఇంట్రస్టింగ్ గా అనిపిస్తుంది. అలాగే క్లైమాక్స్ తో కథకు మంచి జస్టిఫికేషన్ ఇవ్వగలిగాడు దర్శకుడు. కార్తికేయ కథను తన భుజాల మీదేసుకున్నాడు.

దర్శకుడు శేఖర్ కథను బాగా డీల్ చేయగలిగాడు. ఎందుకంటే సున్నితమైన పాయింట్ కాబట్టి.. ఏమాత్రం తేడా చేసినా మొత్తానికే ప్రమాదం వస్తుంది.కానీ అనుకున్న పాయింట్ ను బాగా ఎగ్గిక్యూట్ చేశాడు. డైలాగ్స్ కూడా బాగుంది. అనూప్ రూబెన్స్ సంగీతం పాటల పరంగా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా ఆకట్టుకున్నాడు. పాటలు సినిమాకు మంచి ఎనర్జీని ఇచ్చాయి. ఎడిటింగ్ బాగుంది. సినిమాటోగ్రఫీ కలర్ ఫుల్గా ఉంది. దర్శకుడు యెర్ర శేఖర్ రెడ్డి ఓ కొత్త పాయింట్ చుట్టూ ఎమోషనల్ లవ్ స్టోరీ చెప్పాలనే క్రమంలో సక్సెస్ అయ్యాడు.

ఓవరాల్ గా…
కార్తికేయ తన కెరీర్ తో ట్రై చేసిన కొత్త రకం కథ ఇది. సినిమా ప్రారంభం నుంచి చివరి దాకా బాగా ఎంజాయ్ చెయ్యెచ్చు. కార్తికేయ స్క్రీన్ ప్రెజెన్స్, పోరాటాలు ఇష్టపడే వారికి 90ఎం ఎల్ తప్పకుండా నచ్చుతుంది. మధ్య మధ్యలో వచ్చే కామెడీ సీన్స్, ఎమోషనల్ గావచ్చే సీన్స్ తో అలరిస్తుంది. సో గో అండ్ వాచిట్.

PB Rating : 3/5