A మూవీ రివ్యూ

A మూవీ రివ్యూ
A అనే అక్షరాన్నే టైటిల్ గా పెట్టినప్పుడే దర్శకుడు ఏదో ఓ విషయాన్ని కొత్తగా చెప్పాలనుకుంటున్నాడనే విషయం అర్ఱమైంది. ఈ ట్రైలర్స్ చూసినప్పుడు ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో వస్తున్నాడని రుజువైంది. మరి మంచి బజ్ ని క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. 2018లో తమిళ్ సినిమా సయి చిత్రంలో నెగిటివ్ పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు నితిన్ ప్రసన్న. ఆ తరువాత ఇరంబు తిరై సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించిన నితిన్ ప్రసన్న హీరోగా చేస్తున్న మొదటి సినిమా ఏ ( అడ్ ఇన్ఫినీటం). భిన్నమైన సినిమాలతో ఆకట్టుకుంటున్న నితిన్ ప్రసన్న మరో ప్రయత్నం ఏ. మరి ఏ అంటే ఏమిటి ? ఈ సినిమాలో ఏకంగా మూడు పాత్రల్లో కనిపించిన నితిన్ ప్రసన్న మూడు పాత్రలకున్న లింక్ ఏమిటి ? లాంటి విషయాలు తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే !!

కథేంటంటే :

హైద్రాబాద్ నుండి నరసాపూర్ రహదారిలో బోరు వర్షంలో రోడ్డుపక్కన్న పడిపోయిన ఓ వ్యక్తిని అటుగా వెళ్తున్న వాళ్ళు కాపాడతారు. అయితే హాస్పిటల్ లో జాయిన్ అయినా అతనికి తన గతం గురించి మరచిపోతాడు. అసలు తాను ఎవరు ? ఎక్కడినుండి వచ్చాడు ? అన్న ప్రశ్న అతన్ని నీడలా వెంటాడుతుంది ? అదే హాస్పత్రిలో నర్స్ గా పనిచేస్తున్న పల్లవి ( ప్రీతి అస్రాని ) తనను దగ్గరుండి చూసుకోవడంతో ఆమెపై అభిమానం పెరిగి ప్రేమగా మారుతుంది. పల్లవి కూడా అతని ప్రేమలో పడిపోతుంది. అయితే గతం గురించి తెలియని వ్యక్తి అయినా సరే సంజీవ్ అనే పేరు పెట్టి పెళ్లి చేసుకుంటుంది. అలా పదేళ్లు గడిచిపోతాయి.. ఈ పదేళ్లు అతన్ని ఓ కల వెంటాడుతుంది ? తాను ఎవరు ? ఎక్కడినుండి వచ్చాను ? అని తెలుసుకునే ప్రయత్నాలు చేస్తుంటాడు ? మరి అతనికి తన గతం గురించి తెలిసిందా ? అతనికి మిగతా ఇద్దరికీ గల సంబంధం ఏమిటి ? అన్నది మిగతా కథ.

సమీక్ష
ఈ సినిమాలో హీరోగా విలన్ గా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు హీరో నితిన్ ప్రసన్న. ఇందులో మూడు పాత్రల్లో అయన నటించిన తీరు బాగుంది. ముఖ్యంగా గతం మరచిపోయిన వ్యక్తిగా .. తన గతం గురించి వెతుక్కునే వ్యక్తి సంజీవ్ గా ఆకట్టుకునే నటన కనబరిచాడు. ఇక హీరోయిన్ పల్లవి పాత్రలో ప్రీతి అస్రాని నటన సినిమాకే హైలెట్ అని చెప్పాలి. గృహిణిగా ఒక తల్లి బిడ్డ పాత్రలో ఆద్యంతం ఆకట్టుకుంది. ఇందులో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే విప్లవకారుడు పాత్రలో నితిన్ ప్రసన్న చక్కగా చేసాడు. ఇందిరాగాంధీ పాలన సమయంలో ఏర్పడిన ఎమర్జెన్సీ ని వ్యతిరేకిస్తూ పోరాటం చేసిన విప్లవ వీరుడి పాత్రలో చక్కగా నటించాడు. ఇక అసలు సినిమాకు కీలకం అయిన డాక్టర్ పాత్రలో నితిన్ ప్రసన్న నటన మరో హైలెట్ అని చెప్పాలి. అతని పాత్రలో ఎదో కనిపెట్టేయాలన్న తపనతో తానూ చేస్తున్న పనులు కరెక్ట్ అని సమర్ధించుకునే వ్యక్తిగా నెగిటివ్ రోల్ లో నితిన్ ప్రసన్న నటన హైలెట్ గా నిలుస్తుంది. మొత్తానికి ఏ అని సినిమా నితిన్ ప్రసన్న వన్ మెన్ షో చేసాడని చెప్పాలి. ఈ తరహా సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్స్ కు టెక్నీకల్ అంశాలే కీలకంగా ఉంటాయి. ఈ విషయంలో దర్శకుడు ప్రతి విభాగం నుండి మంచి అవుట్ ఫుట్ రాబట్టాడు. ముఖ్యంగా ఈ సినిమాకు ఆర్ ఆర్ ప్రధాన హైలెట్ గా నిలిచింది. విజయ్ కురాకుల అందించిన మ్యూజిక్ సూపర్ అని చెప్పాలి. ప్రవీణ్ కె బంగారి కెమెరా పనితనం సూపర్బ్. ఇంటెన్సివ్ ఫోటోగ్రఫి తో సినిమాను మరో రేంజ్ లో నిలబెట్టాడు. ఆనంద్ పవన్, మ‌ణి కందన్ అందించిన ఎడిటింగ్ బాగుంది. ఇక దర్శకుడు యుగంధర్ ముని తీసుకున్న పాయింట్ బాగుంది. మనిషి తన యవ్వనం కంటిన్యూ గా అలాగే ఉండేలా మనిషి మెదడులో ఉండే కొన్ని కణాలను కంట్రోల్ చేస్తే మనిషి నిత్య యవ్వనుడిగా ఉంటారన్న పాయింట్ కొత్తగా ఉంది. ముఖ్యంగా దాన్ని ప్రజెంట్ చేసిన తీరు సూపర్. మొత్తానికి యుగంధర్ ముని ఈ సినిమాతో దర్శకుడిగా మంచి ఇమేజ్ అందుకుంటాడు. నిర్మాత గీతా మిన్నాల కథకు అవసరమైనంతగా ఖర్చుకు వెనకాడకుండా క్వాలిటీ సినిమాను అందించారు.

ఫైనల్ గా….
‘A’. డిఫరెంట్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ను ఇటీవలే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విడుదల చేయగా ఆ ట్రైలర్ కు మంచి స్పందన రావడంతో పాటు సినిమా పై మరిన్ని అంచనాలను పెంచింది. విజయ్ సేతుపతి లాంటి స్టార్ మెచ్చుకున్నాడంటే ఆ సినిమా ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా విషయంలో దర్శకుడు మంచి పాయింట్ ను తీసుకుని దాన్నీ సస్పెన్స్ జోడించి తెరకెక్కించిన విధానం బాగుంది. ఇప్పటివరకు మనం ఎన్నో థ్రిల్లర్స్ చూసివుంటాం.. అయితే ఈ సినిమాలో కూడా ఆ బ్లాక్ షీప్ ఎవరు అన్న విషయాన్నీ అటు హీరోకే కాదు ఇటు ప్రేక్షకులకు తెలియకుండా దాచడం బాగుంది. ఇక మూడు పాత్రల్లో నటించిన వన్ మెన్ షో గా సినిమాను మొత్తం తన భుజాలపై ఎత్తుకున్న నితిన్ ప్రసన్న, హీరోయిన్ ప్రీతి ల నటన హైలెట్ అంశాలు. అలాగే టెక్నీకల్ పరంగా కూడా సినిమా బాగుంది. మొత్తానికి థ్రిల్లర్స్ సినిమాలను ఇష్టపడేవారికి ఏ బాగా నచ్చే సినిమా అవుతుంది .

PB Rating : 3.25/5