“ఏ1 ఎక్స్ ప్రెస్” మూవీ రివ్యూ

 

ఓ వైపు హీరోగా, మరో వైపు నిర్మాతగా రెండు బాధ్యతల్ని భుజం మీదేసుకొని సందీప్ కిషన్ సారథ్యంలో రూపొందించిన చిత్రం ఏ1 ఎక్స్ ప్రెస్. పీపుల్స్ మీడియా, అభిషేక్ అగర్వాల్ తో కలిసి సందీప్ ఈ చిత్రాన్ని నిర్మించారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలు తెలుగులో చాలా తక్కువ. క్రీడా నేపథ్యంలో వచ్చిన చాలా చిత్రాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇప్పుడు ఈ చిత్రం మీద కూడా సందీప్ అంతే నమ్మకంతో ఉన్నాడు. సందీప్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. డెన్నిస్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.

కథేంటంటే…
సందీప్ నాయుడు (సందీప్ కిషన్) సరదాగా జీవితాన్ని గడుపుతుంటాడు. ఫ్రాన్స్ లో సెటిల్ కావాలనుకుంటాడు. యానాంలో అంకుల్ ఇంటికి వెళ్తాడు. అక్కడ హాకీ ప్లేయర్ లావు (లావణ్య)ను చూసి ప్రేమిస్తాడు. ఇదే పరిచయంలో చాలా విషయాలు తన జీవితంలో ఎదురవుతాయి. ఓ సందర్భంలో హాకీ ఆడాల్సిన పరిస్థితి వస్తుంది.
మరో వైపు… హాకీ గ్రౌండ్ ను ఫార్మా కంపెనీకి కట్టబెట్టాలని స్పోర్ట్ మినిస్టర్ (రావు రమేష్) ప్రయత్నిస్తుంటారు. దీంతో ఈ గ్రౌండ్ ని దక్కించుకునేందుకు స్థానికులతో పాటు క్రీడా కారులు కూడా ప్రయత్నిస్తారు. ఈ ప్రయత్నంలో సందీప్ కూడా ఇన్ వాల్వ్ అవుతాడు. ఇంతకూ సందీప్ గ్రౌండ్ ను దక్కించుకునే ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడా లేదా అన్నదే అసలు కథ.

సమీక్ష

సందీప్ కిషన్ ఈ సినిమాకు చేసిన గ్రౌండ్ వర్క్ అలాగే మొదటి నుంచి తనలో ఉన్న తపన కంప్లీట్ గా ఈ సినిమాలో కనిపిస్తుంది. ఒక స్పోర్ట్స్ పర్సెన్ లానే కాకుండా రోమ్ కామ్ రోల్ లో కూడా సూపర్బ్ గా కనిపించాడు. మరి అలాగే సందీప్ ఎమోషన్స్ ను కూడా చాలా బాగా పండిస్తాడు అలాంటి కొన్ని విపరీత భావోద్వేగ సన్నివేశాల్లో సందీప్ మంచి నటనను కనబరిచాడు. అంతే కాకుండా హాకీ మ్యాచ్స్ టైం లో సెటిల్డ్ ఫిజిక్ తో ఓ రియల్ స్పోర్ట్స్ పర్సన్ లా కనిపిస్తాడు. ఈ సినిమా నటుల్లో మరో స్పెషల్ మెన్షన్ ఎవరినైనా చెయ్యాలి అంటే అది రావు రమేష్ అనే చెప్పాలి. ఇప్పటి వరకు ఆయన ఎన్నో సాలిడ్ రోల్స్ చేశారు అలాంటి వాటిలో ఈ సినిమాలోది కూడా ఒకటి చెప్పొచ్చు. ఓ పొలిటీషియన్ గా సినిమా మొదటి నుంచి ఎండింగ్ వరకు ఆధ్యంతం సాలిడ్ నటనను కనబరిచారు. అలాగే మరో సెటిల్డ్ నటుడు మురళీ శర్మ హాకీ కోచ్ గా మంచి పాత్రలో కనిపించారు. ఇక లావణ్య త్రిపాఠి విషయానికి వస్తే ఒకపక్క తాను గ్లామరస్ గానే కాకుండా తాను కూడా ఓ స్పోర్ట్స్ ఉమెన్ గా తన పాత్ర పరిధి మేర బాగా చేసింది. తనకి సందీప్ కు మధ్య కొన్ని ఎమోషన్స్, రొమాంటిక్ సీన్స్ వంటి వాటిలో మంచి కెమిస్ట్రీ కనబడుతుంది.

అయితే ఇలాంటి స్పోర్ట్స్ డ్రామాలో విజువల్స్ చాలా ముఖ్యం అవి ఎంత రియలిస్టిక్ గా ఉంటే ఆడియెన్స్ కు ఒక నిజమైన మ్యాచ్ చూసిన అనుభవం కలుగుతుంది వాటిని ఇందులో అద్భుతంగా చూపించారు. ముఖ్యంగా క్లైమాక్స్ మ్యాచ్ అయితే ఒక పక్క మంచి టెన్స్ తో పాటుగా అద్భుతమైన విజువల్స్ కనిపిస్తాయి.వీటితో పాటుగా ఈ స్పోర్ట్స్ లో ఎలాంటి కార్పొరేట్ పాలిటిక్స్ జరుగుతున్నాయి వాటిపై అందరు తెలుసుకోవాల్సిన ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఆకట్టుకుంటుంది. అలాగే కథానుసారం వచ్చే ట్విస్ట్ కానీ అక్కడక్కడా కామెడీ సీన్స్ కానీ బాగుంటాయి. వీటితో పాటుగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చిన రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిల కాంబో నవ్వులు పూయిస్తుంది. దర్శకుడు గ్రిప్పింగ్ గా కథను నరేట్ చేసిన విధానం బాగుంది. ఈ చిత్రంలో నిర్మాణ విలువలు మాత్రం ఖచ్చితంగా స్పెషల్ గా ఉన్నాయని చెప్పాలి. ఒరిజినల్ వెర్షన్ కంటే కూడా మేకర్స్ చాలానే మార్పులు చేర్పులు చెయ్యడమే కాకుండా అన్ని విభాగాల్లో కూడా టెక్నిషియన్స్ మంచి అవుట్ పుట్ ను అందించారు. ముఖ్యంగా కెవిన్ రాజ్ ఇచ్చిన సినిమాటోగ్రఫీ అవుట్ స్టాండింగ్ గా ఉంటుంది. అలాగే హిప్ హాప్ తమీజా మ్యూజిక్ కూడా ఈ చిత్రంలో మరో ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు. డైలాగ్స్ బాగున్నాయి, చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఓకే అనిపిస్తుంది. డెన్నిస్ జీవన్ కనుకొలను విషయానికి వస్తే..ఆల్రెడీ తాను చేసింది రీమేక్ సబ్జెక్ట్ కాబట్టి మెయిన్ లైన్ లో చెప్పడానికి ఏమీ లేదు కానీ దానిని ఎలా హ్యాండిల్ చేసాడు అన్నదే ఇక్క పాయింట్. ఈ విషయంలో మాత్రం డెన్నిస్ కు తన మొదటి ప్రయత్నంలో మంచి మార్కులు వెయ్యొచ్చు. నటీనటుల నుంచి సాలిడ్ పెర్ఫామెన్స్ లను ఈ దర్శకుడు రాబట్టుకున్నాడు. అంతే కాకుండా కొన్ని ఎమోషన్స్ ను హ్యాండిల్ చేసిన విధానం కూడా బాగుంది.

 

చివరగా…

“ఏ1 ఎక్స్ ప్రెస్”..ఓ ఎంగేజింగ్ స్పోర్ట్స్ డ్రామా అని చెప్పాలి. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు తీయడం చాలా కష్టం. కానీ సందీప్ అన్నీ ముందుండి నడిపించాడనిపించింది. ఆయన కష్టం స్క్రీన్ లో కనిపించింది. నటీనలు పెర్ ఫార్మెన్స్ తో పాటు..రావ్ రామేష్ ఎక్స్ ట్రార్డినరీ నటన… టెక్నికల్ టీం వర్క్, డైరెక్టర్ టాలెంట్ తో ఏ 1 ఎక్స్ ప్రెస్ ని సక్సెస్ తీరాలకు చేర్చారు. ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేసిన ఏ 1 ఎక్స్ ప్రెస్… సో గో అండ్ వాచిట్.

PB Rating : 3.25/5