ఆది-వీరభద్రం చౌదరి

అల్లని నరేష్ హీరోగా వచ్చిన అహా నా పెళ్లంట సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యిన స్టార్ డైరెక్టర్ వీరభద్రమ్ చౌదరి గుర్తున్నాడా. ఈవీవీ సత్యనారాయణ, తేజ లాంటి సీనియర్ దర్శకుల వద్ద దర్శకత్వ శాకలో పనిచేసిన ఆయన తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే తర్వాత సునీల్‌తో చేసిన పూలరంగడు సినిమా కూడా అటు కలెక్షన్లు కురిపించి…ఈయనపై పూలు కురిపించింది.

తర్వాత నాగార్జునతో చేసిన భాయ్ సినిమా డిజాస్టర్ అవ్వడంతో చాలా రోజుల పాటు గ్యాప్ తీసుకుని ఇప్పుడు ఆది హీరోగా  " చుట్టాలబ్బాయి " సినిమా చేయడానికి రెఢీ అయ్యాడు. ఐశ్వర్య ఫిలింస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా రామ్ తలారి సమర్పణలో వెంకట్ తలారి నిర్మించే ఈ సినిమాకు ఎస్ఎస్.థమన్ స్వరాలందిస్తారు.