ఆది ప్యార్ మే పడిపోయానే సెన్సార్ రిపోర్ట్

లవ్ లీ స్టార్ ఆది, శాన్వి కలిసి లవ్ లీ వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత నటిస్తున్నప్యార్ మే పడిపోయానే నిర్మాణం పూర్తయింది. అధినేత ఏమైంది ఈవేళ వంటి హిట్ చిత్రాల్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత కె.కె.రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై సామాన్యుడు, శ్రీమన్నారాయణ వంటి హిట్ చిత్రాల దర్శకుడు రవి చావలి దర్శకత్వంలో నిర్మించిన ప్యార్ మే పడిపోయానే సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తి చేసుకొని యు బై ఎ సర్టిఫికెట్ పొందింది. 

ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ.. మా చిత్రం సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తి చేసుకొని యు బై ఎ సర్టిఫికెట్ పొందింది. మంచి లవ్ ఫీల్ తో చక్కని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని నిర్మించామని సెన్సార్ సభ్యులంతా ప్రశంసించారు. ఆది, శాన్వికి లవ్ లీ తర్వాత ప్యార్ మే పడిపోయానే మరో సూపర్ హిట్ సినిమా అవుతుంది. అనూప్ అందించిన మ్యూజిక్ ఆల్ రెడీ సూపర్ హిట్ అయింది. ఈనెల 3న ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేస్తున్నాం. ఈనె 9నే సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. అని అన్నారు.