సెంటిమెంట్లో ఆగడు చూపిస్తున్నదూకుడు

ప్రిన్స్ మహేష్‌బాబు తాజా చిత్రం ఆగడుపై రోజురోజుకు అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ సినిమాను ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా భారీగా 2300 థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా దూకుడులాగే సూపర్ హిట్ అవుతుందన్న వార్తలు వస్తున్నాయి. దూకుడు ముందు ఎలా జరిగిందో ఇప్పుడు కూడా అవే సెంటిమెంట్లు రిపీట్ అవుతున్నాయని పలువురు మహేష్ అభిమానులు, పండితులు జోస్యం చెపుతున్నారు. ఒక్కసారి ఆ సెంటిమెంట్లు చూద్దాం

.1.దూకుడు మూడు అక్షరాల సినిమా.. ఇప్పుడు ఆగడు కూడా మూడు అక్షరాల సినిమా

2.దూకుడులో చివర డు ఉంది.. ఆగడులో కూడా చివర డు ఉంది

3.దూకుడుకు ఆగడుకు 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ వారే నిర్మాతలు

4.దూకుడుకు ఆగడుకు శ్రీనువైట్లయే దర్శకుడు

5.దూకుడును మ్యూజికల్ హిట్ చేసిన థమనే ఈ సినిమాకు కూడా సంగీత దర్శకుడు(పైగా ఇది థమన్‌కు సంగీత దర్శకుడిగా 50వ చిత్రం)

6.దూకుడు సెప్టెంబర్‌లో విడుదలై హిట్ కొడితే ఇప్పుడు ఆగడు కూడా అదే నెలలో వస్తోంది

7.దూకుడుకు ముందు మహేష్‌కు ఖలేజా లాంటి డిజాస్టర్ వస్తే ఇప్పుడు ఆగడుకు ముందు వన్ ఫ్లాప్ అయ్యింది

8.దూకుడులో హీరోయిన్ సమంత పేరులో మూడు అక్షరాలుంటే ఆగడులో తమన్నా పేరు కూడా మూడక్షరాలే

9.దూకుడులో పువ్వాయ్ అప్పారావు ఐటం సాంగ్ హైలెట్. ఇప్పుడు ఆగడులో కూడా శృతీహాసన్ స్పెషల్ సాంగ్ హైలెట్‌కానుంది.

10.దూకుడులో మహేష్ తండ్రి పాత్ర పోషించిన ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ పేరు శంకర్ నారాయణ్. ఆగుడులో మహేష్ క్యారెక్టర్ పేరు ఎన్ కౌంటర్ శంకర్.