ఢిల్లీలో క‌ల‌క‌లం: ఆప్ ఎమ్మెల్యేపై కాల్పులు

దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఆప్ ఎమ్మెల్యే వేద‌ప్ర‌కాష్‌పై గుర్తు తెలియ‌ని దండుగులు కాల్పులు జ‌రిపారు. గురువారం అర్ధ‌రాత్రి దాటాక కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఈ కాల్పుల‌కు పాల్ప‌డ్డారు. ఈశ్వ‌ర్ కాల‌నీలోని ఆయ‌న కార్య‌ల‌యం ఎదుటే ఈ కాల్పులు జ‌రిగాయి. అయితే ఈ ఘ‌ట‌న‌లో ఆయ‌న‌కు ఎటువంటి గాయాలు కాలేదు.

ఢిల్లీలోని బ‌వానా నియోజ‌క‌వ‌ర్గానికి వేద‌ప్ర‌కాష్ ప్రాథినిత్యం వ‌హిస్తున్నారు. నిందితుల‌ను ప‌ట్టుకునేందుకు పోలీసులు గాలింపు చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశారు. అధికార‌పార్టీగా ఉన్న ఆప్ ఎమ్మెల్యేపై కాల్పుల ఘ‌ట‌న ఢిల్లీలో ఒక్క‌సారిగా సంచ‌ల‌నం సృష్టించింది.