అబ్బాయితో అమ్మాయి మూవీ రివ్యూ

ప్రేక్షకులే కాదు దర్శకులు సైతం కొత్త దనం కోరుకుంటున్నారు. జాదుగాడు వంటి మాస్ చిత్రం ఫెయిల్ అవ్వడంతో… మళ్లీ లవ్ ట్రాక్ లోకి పడ్డాడు నాగశౌర్య. అలాగే దర్శకుడు రమేష్ వర్మ సైతం వీర వంటి మాస్ ఎంటర్ టైనర్ తీసిన తర్వాత పూర్తి స్థాయి ప్రేమ కథా చిత్రం రాసుకున్నాడు. తనదైన పబ్లిసిటీ డిజైన్స్ తో ఆకట్టుకున్న రమేష్ వర్మ ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించాడో చూద్దాం.

ఫేస్ బుక్ నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇది. కనిపించకుండా ఫ్రెండ్ షిప్ చేయడం… కనిపించిన అమ్మాయిని ప్రేమించడం…. ఆ అమ్మాయే ఈ అమ్మాయి అని హీరోకు తెలియడం… ఫ్రెండ్ నే హీరోయిన్ ప్రేమించడం… ఇలా సాగుతుంది అబ్బాయితో అమ్మాయి ప్రేమ కథ. ప్రేమ కథల్లో నేటి ట్రండ్ కు తగ్గట్టుగా కథ రాసుకున్నాడు రమేష్ వర్మ. అంటే రియల్ వరల్డ్ కి… వర్చువల్ వరల్డ్ కి ఉన్న తేడాను చూపించే ప్రయత్నం చేశాడు. కథాపరంగా ఓకే అనిపించుకున్నాడు దర్శకుడు. కథనంలోనూ… ఫ్యామిలీ ఎమోషన్స్ ను బాగానే డీల్ చేశాడు. కేవలం ప్రేమ, ఫ్యామిలీ మాత్రమే కాకుండా కెరీర్ పరంగానూ కొన్ని మంచి సీన్స్ రాసుకున్నాడు. హీరో నాగశౌర్యను కూడా కొత్తగా చూపించే ప్రయత్నం చేసాడు. రెగ్యులర్ కథగా కాకుండా… విభిన్నంగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే రమేష్ వర్మ చాలా సన్నివేశాల్ని బోరింగ్ గా రాసుకున్నాడు. ప్రెడిక్టబుల్ సీన్స్ బోర్ కొట్టించాయి. అలాగే ఎంటర్ టైన్ మెంట్ పార్ట్ కూడా లేకపోవడంతో… సాదా సీదాగా సాగిపోతుంది.

హీరో నాగశౌర్య తన పాత్ర వరకు బాగా చేసాడు. ఎమోషనల్ సీన్స్ లోనూ మెప్పించాడు. కొత్త లుక్ తో కనిపించాడు. ఓవరాల్ గా నటుడిగా మెచూరిటీ చూపించాడు. హీరోయిన్ పాలక్ పొట్టి గౌనుల్లో కవ్వించింది. హీరో హీరోయిన్స మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ బాగా పిక్చరైజ్ చేసారు. ఇళయరాజా ఈసారి ఫ్లాప్ అయ్యారు. రీరికార్డింగ్ సైతం పట్టించుకోలేదు. సీనియర్ తమిళ నటుడు మోహన్ కాకుండా తెలుగు వారిని ఎవరినైనా పెట్టి ఉండాల్సింది. రావు రమేష్ క్యారెక్టర్ కు సోల్ లేకుండా పోయింది. సడన్ గా మారిపోవడం అంతగా మెప్పించలేదు. ప్రగతి, తులసి కి అలవాటైన పాత్రలే. రాజ్ తరుణ్ వాయిస్ ఓవర్ ఇంట్రడక్షన్ బాగుంది. నాగ శౌర్య, షకలక శంకర్, లాస్య కామెడీ వర్కవుట్ కాలేదు. సినిమా సాగదీసినట్టుగా అనిపిస్తుంది. పాటలు మరీ ఎక్కువయ్యాయి. పాటలు సందర్భాన్ని పట్టించుకోకుండా కథను బాగా డిస్ట్రబ్ చేశాయి. ఆ పాటలు కూడా అంతగా నప్పేలా లేకపోవడంతో… ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారాయి. క్లైమాక్స్ ని సెంటిమెంటల్ గా ఎయిర్ పోర్ట్ లో ప్లాన్ చేసాడు. గతంలో చాలా హిట్ చిత్రాలు ఎయిర్ పోర్ట్ లోనే ముగిశాయి. కానీ రమేష్ వర్మ మాత్రం చివరికి సరిగ్గా ప్రెజెంట్ చేయలేకపోయాడు. ఆడియెన్స్ ను కన్విన్స్ చేసే విధంగా క్లైమాక్స్ లేదు. హీరో హీరోయిన్స్ విడిపోయిన దానికి చెప్పిన కారణం బలంగా లేకపోవడంతో.. ఆ తర్వాతినుంచి ఆడియెన్స్ కథకు సరిగ్గా కనెక్ట్ కాలేకపోయారు. సినిమాటోగ్రఫి సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. నిర్మాతలు సైతం ఖర్చుకు వెనకాడకుండా ఖర్చు పెట్టారు. డైలాగ్స్ ఆకట్టుకునేలా లేవు.

నాగ శౌర్య కెరీర్లో ఓ డిఫరెంట్ లవ్ ఎటెంప్ట్ అని చెప్పొచ్చు. యూత్ ని ఎట్రాక్ట్ చేసే పాయింట్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి…
PB Rating – 3/5