ప్రాణం పెట్టిన సినిమా పోస్టర్ లీకయ్యింది..ప్చ్..శ్రద్ధా, వరుణ్ అప్ సెట్

ABCD 2 Poster : ఓ సినిమా తీయాలంటే ఎంతగా కష్టపడాలో చెప్పక్కర్లేదు. సినిమాతో పాటు ప్రమోషన్ కోసం విభిన్నమైన ప్రయత్నాలు చేస్తుంటారు. అలా ప్రయత్నించి రూపొందించిన తమ సినిమా పోస్టర్ సడన్ గా బయటికి రావడంపై హీరో వరుణ్ ధావన్, హీరోయిన్ శ్రద్ధా కపూర్ బాగా అప్ సెట్ అయ్యారు. తాము ప్రాణం పెట్టిన సినిమా పోస్టర్ అనుకోకుండా దర్శనమివ్వడం తమకు ఆశ్చర్యాన్ని కలిగించిందని… అయినా సరే… అద్భుతమైన పోస్టర్ ఇదే అంటూ… సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో తమ ఎక్స్ పీరియన్స్ ను షేర్ చేశారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని చెబుతున్నారు. డ్యాన్స్ నేపధ్యంలో తెరకెక్కించినా… ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రతిబింబిస్తుందని చెబుతున్నారు.

రెమో డిసౌజా ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. యూటీవీ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై సిద్ధార్థ్ రాయ్ కపూర్ నిర్మించారు. వరుణ్ ధావన్, శ్రద్ధా కపూర్, ప్రభుదేవా కీలక పాత్రలు పోషించారు. ప్రభుదేవా నెగెటివ్ పాత్రలో కనిపించబోతున్నాడు. జూన్ 19న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.