తెలంగాణ‌లో డెస్క్ జ‌ర్న‌లిస్టుల‌కు అక్రిడేష‌న్లు

తెలంగాణ మీడియా రంగంలో స‌రికొత్త విప్ల‌వం రాబోతుంది. అక్క‌డ అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని రాష్ర్ట మీడియా అక్రిడేషన్ కమిటీ నిర్ణయించింది. ఇప్ప‌టికే అక్క‌డ రిపోర్ట‌ర్ల‌కు అక్రిడేష‌న్ కార్డులు మంజూరు చేస్తున్నారు. తాజాగా అక్రిడేష‌న్ క‌మిటీ నిర్ణ‌యం మేర‌కు మొత్తం మూడు విడతలలో ఈ అక్రిడేషన్ కార్డులను జారీచేయనున్నట్టు కమిటీ తెలిపింది.

తొలి విడతలో ఇప్పటికే అక్రిడేషన్ కార్డులు ఉన్న జర్నలిస్టులకు కొత్త కార్డులు అందజేయాలని నిర్ణయించినట్టు తెలంగాణ ప్రెస్ అకాడెమీ చైర్మన్, రాష్ట్రస్తాయి అక్రిడేషన్ అకాడెమీ చైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు. రెండో ద‌శ‌లో మిగిలిన వారికి అక్రిడేష‌న్ కార్డ‌లిస్తారు. అర్హులైన డెస్క్ జర్నలిస్టులకు మూడో విడతలో అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని కమిటీలో నిర్ణయించిన‌ట్టు ఆయ‌న తెలిపారు. ఈ నిర్ణ‌యం ప‌ట్ల జ‌ర్న‌లిస్టులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.