షాకింగ్ న్యూస్‌: కోలీవుడ్ హీరో ఇంట్లో ఏనుగు దంతాలు

ప్ర‌ముఖ త‌మిళ హీరో జ‌య‌రామ్ ఇంట్లో ఏనుగు దంతాలు ల‌భ్యం కావ‌డంపై వివాదం రేగుతోంది. ఈ అంశాన్ని అట‌వీ హ‌క్కుల ఉద్య‌మకారులు తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్నారు. వివ‌రాలిలా ఉన్నాయి. రెండేళ్ల కింద‌ట జ‌య‌రామ్ పెంచుకున్న ఏనుగు చ‌నిపోయింది.ఐతే.. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా దాని దంతాలు తీసి జ‌య‌రామ్ దాచుకున్నాడు. ఇందుకు కేర‌ళ అట‌వీ శాఖ కూడా ఆమోదం తెలిపింది.

2003 డిక్లరేషన్ వైల్డ్ లైఫ్ స్టాక్ రూల్ ప్రకారం..ఇది నేరమని జంతుప్రేమికులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ చ‌ట్టంలో పేర్కొన్న‌ట్లు ఏ వ్యక్తి అయినా జంతువుపైగానీ, అది చనిపోయిన తర్వాత దాని అవశేషాలపైగానీ హక్కు పొందాలంటే ముందు వారసత్వ ధ్రువపత్రాన్ని పొందాలని అలాంటిదేమి జయరామ్ వద్ద లేదన్న‌ది వారి వాద‌న‌. వివాదం నానాటికీ తీవ్రత‌రం కావ‌డంతో ప్రధాని నరేంద్రమోడీకి ఫారెస్ట్ టాస్క్ ఫోర్స్ ఓ లేఖ రాసింది. ఈ విషయంలో త‌క్ష‌ణం జోక్యం చేసుకోవాలని ప్రధానిని కోరింది.