పాలిటిక్స్ పై నరేష్ సెన్సేషనల్ కామెంట్స్

సీనియర్ నటుడు నరేష్ స్వతహాగా బిజెపి పార్టీ నాయకుడు  అయినప్పటికీ… అవసరమైతే ఇండిపెండెంట్ కే ఓటేస్తానన్నాడు. రాజకీయాలు భ్రష్టుపట్టాయని తీవ్రంగా దుయ్యబట్టారు. 

మీడియా మిత్రులతో ఆయన మాట్లాడుతూ… ఈసారి నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. నాకు కొన్ని సిద్ధాంతాలున్నాయి. వాటినే నమ్ముతాను. కానీ ఆసారి జరుగుతున్న ఎలక్షన్లు డబ్బు చుట్టే తిరుగుతుంది.

బాగా డబ్బున్న వారికి, ఇండస్ట్రియలిస్టులకు టిక్కెట్లిస్తున్నారు. ఎంపి సీటుకు 50 కోట్లు ఖర్చుపెడుతున్నారట. నేను అలా ఖర్చుపెట్టలేను. దీన్ని నేను వ్యతిరేకిస్తున్నాను.

అయితే రాబోయే 5 రోజుల్లో మంచి మార్పులొస్తాయని ఆశిస్తున్నా. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లు పొలిటికల్ స్టెప్ తీసుకున్నారు. నేను మాత్రం పార్టీని బట్టి కాకుండా… అవసరమైతే ఇండిపెండెంట్ కు అయినా ఓటేస్తాను. మోడీ మంచి నాయకుడు. అందుకే ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. అని అన్నారు.