హేమ‌పై ఈ చెత్త రూమ‌ర్ ఏంటి..? బయటికి వచ్చిన రహస్యం…

టాలీవుడ్‌లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ హేమ‌కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఎలాంటి కామెడీ రోల్స్ చేయ‌డంలో అయినా ఆమెది అందెవేసిన చేయి. హేమ అంటే డేరింగ్ అండ్ డాషింగ్‌కు మారుపేరు. ఆమె త‌న త‌ప్పులేక‌పోతే ఎవ్వ‌రిని అయినా ఇండ‌స్ట్రీలో నిల‌బెట్టి నిగ్గ‌దీస్తుంద‌న్న టాక్ కూడా ఉంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో త‌న‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసినందుకు గాను మ‌రో జంట్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌పై ఆమె కేసు పెట్టేందుకు సైతం వెనుకాడ‌లేదు.

గ‌డుగ్గాయ్ అయిన హేమ‌పై కొన్ని వెబ్‌సైట్ల‌లో గ‌త నాలుగు రోజులుగా ఓ షాకింగ్ రూమ‌ర్ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఆమె ఓ సెమీ పోర్న్ టైప్ మూవీలో న‌టించిందంటూ వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. దానికి సంబంధించిన వీడియోను కూడా ఆ సైట్లు ప్ర‌చారం చేశాయి. కొన్ని యూ ట్యూబ్ ఛానెళ్లు సైతం పోర్న్ వీడియోలో హేమ అంటూ అస‌భ్య‌క‌ర వీడియోలు త‌మ సైట్ల‌లో ఓ వార్త‌ను వీడియోల రూపంలో పెట్టేశాయి.

ఈ వార్త‌లు సోష‌ల్ మీడియాలో కూడా జోరుగా స్ప్రెడ్ అవ్వ‌డంతో ఇవి టాలీవుడ్‌లో సైతం పెద్ద చ‌ర్చ‌కు వ‌చ్చాయి. దీనిపై అస‌లు మ్యాట‌ర్ ఆరా తీస్తే విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఏపీలోని తూర్పుగోదావ‌రి జిల్లా కోన‌స‌మీలోని రాజోలుకు చెందిన హేమ తెలుగు సినిమాల్లోకి రాక‌ముందు కొన్ని త‌మిళ్ సినిమాల్లో కూడా న‌టించింది. ఆ సినిమాలో ఓ సీన్‌కు అనుగుణంగా హీరోతో ఆమె రొమాన్స్ చేయాల్సి ఉంది. ఆ సీన్ కాస్త హాట్‌గా ఉంటుంది.

కేవ‌లం ఆ ఒక్క సీన్‌ను బేస్ చేసుకుని కొన్ని తెలుగు వెబ్ సైట్లు హేమ ఆ టైప్ సినిమాలో న‌టించిందంటూ వార్త‌లు రాసేశాయి. ఈ వార్త తెలుగు మీడియా వెబ్‌సైట్లు ఇష్టానుసారంగా చేస్తోన్న దుష్ప్ర‌చార ప‌రంప‌ర‌లో ఒక‌టిగా నిలిచింది. తెలుగు మీడియా వెబ్‌సైట్లు ఇలాంటి క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల‌పై ఇలాంటి వార్త‌లు ప్ర‌చురించ‌డం ఇదే తొలిసారి కాదు. గ‌తంలో స‌న‌, ప‌విత్రా లోకేష్ ఇప్పుడు హేమ‌పై ఇష్ట‌మొచ్చిన‌ట్టు రాసేశారు. ఇప్ప‌టికైనా వెబ్‌సైట్లు వార్త‌ల ప్ర‌చారంలో నిజానిజాలు తెలుసుకుని రాస్తే ఆ వార్త‌ల‌కు విలువ ఉంటుంది. వెబ్‌సైట్ల‌కు క్రేజ్ ఉంటుంది.