భారతంలో కృష్ణుడు… కళ్లతోనే నటించేస్తాడు… – పూజా హెగ్డే

మాజీ మిస్ ఇండియా పూజాహెగ్డే నాగచైతన్య ఒక లైలా కోసం సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. తాజాగా ఆమె నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్ హీరోగా పరిచయమౌతున్న ముకుంద చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా స్టిల్స్, ట్రైలర్స్ చూస్తుంటేనే ఆమె పదహారణాల అచ్చ తెలుగు ఆడపిల్లలా కనిపిస్తోంది. గోపికమ్మా చాలమ్మా ఇక నీ నిదుర అంటూ తెలుగు కుర్రకారు ప్రేక్షకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ముకుంద చిత్రం ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా పూజాహెగ్డే ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ మీకోసం…

 

> తెలుగు చిత్ర పరిశ్రమలో పని చేయడం ఎలా అనిపిస్తోంది ?

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరు స్నేహంగా ఉంటారు. మనకు తెలియని విషయాలను తెలిసేంత వరకు చెపుతారు. ఇక్కడ ప్రజల్లో ఆప్యాయత నాకు ఎంతో ఇష్టం.

> ముకుందలో మీ పాత్ర ఎలా ఉండబోతోంది.

అచ్చతెలుగు అమ్మాయిని. రావు రమేష్ కూతురిగా కనిపిస్తాను. ప్రతి తండ్రి తనకు ఎలాంటి కూతురు కావాలనుకుంటాడో అలాంటి తరహా పాత్ర నాది. తొలి సినిమా ఒక లైలా కోసంలో మోడ్రన్ గర్ల్‌గా నటిస్తే ఇందులో సంప్రదాయం ఉట్టిపడే అమ్మాయిగా కనిపిస్తాను. నటనకు ఆస్కారమున్న పాత్ర దొరకడం ఆనందంగా ఉంది.

> నాగబాబు తనయుడు మెగా వారసుడిగా ఇంట్రడ్యూస్ అవుతున్న వరుణ్‌తో నటించడం ఎలా అనిపించింది ?

వరుణ్‌కు ఇదే తొలి సినిమా. అతడు కళ్లతోనే నటించేస్తాడు. మెగా ఫ్యామిలీలో నెక్ట్స్ తరంలో అతడు గొప్ప హీరో అవుతాడు. అతని హైట్‌పై నేను జోకులు వేసే దాన్ని. అతడు చాలా స్వీట్ పర్సన్. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. 

> వరుణ్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ?

భారతంలో శ్రీకృష్ణుడు లాంటి వాడు వరుణ్. ఇది పొలిటికల్ బేస్‌డ్ స్టోరీ… అయినా ఎగ్జైటింగ్ లవ్‌స్టోరీ కూడా మిక్స్ అయి ఉంది. ఫస్ట్ సినిమాకే వరుణ్ కి ఇంత మంచి సబ్జెక్ట్ దొరకడం చాలా లక్కీ. తన క్యారెక్టర్ కు పూర్తి న్యాయం చేశాడు. 

> డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాలతో వర్క్ చేయడం ఎలా ఉంది ?

ఆయన నటీనటులకు పూర్తి ఫ్రీడం ఇస్తారు. దీంతో ఇబ్బంది లేకుండా ఇన్వాల్ అయి నటించొచ్చు. ఆయన దర్శకత్వం వహించిన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చూశాను. హీరోయిన్స్‌ను ఆయన చాలా అందంగా ప్రజెంట్ చేస్తారు. స్టోరీని నెరేట్ చేసే విధానం చాలా బాగుంటుంది. నా క్యారెక్టర్ ను చాలా బాగా డిజైన్ చేశారు. ప్రతీ పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది.

> హృతిక్‌రోషన్ మెహింజొదారో సినిమాలో ఎలా ఛాన్స్ కొట్టారు ?

రణబీర్‌కపూర్‌తో టీవీఎస్ యాడ్‌ చేశాను. దర్శకుడు అషుతోష్‌గోవారికర్ భార్య సునీత చూసి నాకు ఈ అవకాశం ఇచ్చారు. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. హిస్టారికల్ సినిమాలో నటించడం నాకు హ్యాపీగా ఉంది. హృతిక్ లాంటి స్టార్ పక్కన నటించడం గురించి మాటల్లో వర్ణించలేను.

> గ్లామరస్ క్యారెక్టర్స్ చేస్తారా ? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి…

గ్లామరస్‌గా కనిపించడానికి నేను రెఢీ. ఆ తరహా క్యారెక్టర్స్ వస్తే తప్పకుండా చేస్తా. అయితే స్క్రిప్ట్, దర్శకుడిని బట్టి నటించాలా వద్దా అనేది డిసైడ్ చేస్తా. ఇప్పుడు కొత్త ప్రాజెక్టుల గురించి ఆలోచంచట్లేదు. ముకుంద, మోహంజొదారో తర్వాతే ఫ్యూచర్ ప్రాజెక్టు గురించి ఆలోచిస్తాను.