నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం: నటి శారదకు గాయాలు

నల్గొండ జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటి ఊర్వశి శారదకు గాయాలయ్యాయి. మునగాల మండలం ఆకుపాముల వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పడంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఆమె మరోవాహనంలో హైదరాబాద్ బయలు దేరారు.

ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరిన ఆమె ప్రయాణిస్తున్న కారుకు ఆకుపాముల వద్దకు రాగానే గేదెలు అడ్డువచ్చాయి. దీంతో కారు డ్రైవర్ కారును పక్కకు తప్పించబోయాడు. దీంతో శారదకు స్వల్పగాయాలయ్యాయి.