శ్రీ‌దేవికి అంత‌గా ఎందుకు కోప‌మొచ్చింది..?

పులి ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌పై శ్రీ‌దేవి గుర్రుగా ఉంది. వాళ్లు క‌నిపిస్తే అరిచేస్తుంది.. ఫోన్ లోనూ క‌రిచేస్తుంది. అంత‌గా అతిలోక‌సుందరికి ఎందుకు కోపం వ‌చ్చింది..? అస‌లు పులి టీం శ్రీ‌దేవికి ఏం ద్రోహం చేసింది..? అస‌లు విష‌యం ఏంటంటే.. పులిలో శ్రీ‌దేవి మ‌హారాణిగా న‌టిస్తుంది. ఈమె పాత్ర సినిమాలో చాలా కీల‌కం. అనుకున్న దాని ప్ర‌కారం శ్రీ‌దేవికి సినిమాలో చాలా స‌న్నివేశాలు ఇచ్చారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. కానీ చివ‌ర్లో ఎడిటింగ్ లో చూసుకునే స‌రికి సినిమా లెంత్ మ‌రీ ఎక్కువైపోయింది. దాంతో ఆప్ష‌న్ లేక శ్రీ‌దేవి పాత్ర‌నే క‌త్తిరించి పారేసారు.

వీళ్లు చెప్పేట‌ప్పుడు ఆస్కార్ చూపించారు.. తీసేట‌ప్పుడు మాత్రం న‌ర‌కం చూపించారంటూ ఇప్పుడు శ్రీ‌దేవి స‌న్నిహితుల‌తో చెప్పుకోవ‌డం మాత్ర‌మే మిగిలింది. డ‌బ్బింగ్ చెప్ప‌డానికి వ‌చ్చిన శ్రీ‌దేవి.. ఎడిటింగ్ లో త‌న పాత్ర‌కు కోత పెట్ట‌డం చూసి అరిచేసిందంట‌. అస‌లు త‌న పాత్ర‌కు ఎందుకు తీసేయాల్సి వ‌చ్చిందో కార‌ణం చెప్పాల‌ని ద‌ర్శ‌కుడు చింబు దేవ‌న్ ను కోరింద‌ని స‌మాచారం. దానికి లెంత్ ప్రాబ్ల‌మ్ అని చెప్ప‌గానే కోపంతో అక్క‌డి నుంచి శ్రీ‌దేవి వెళ్లిపోయిందని స‌మాచారం. ఈమె కోపం త‌గ్గాలంటే రేపు పులి విడుద‌లై విజ‌యం సాధించి.. అందులో త‌న పాత్ర‌కు మంచి అప్లాజ్ వ‌స్తే గానీ శ్రీ‌దేవి కోపం చ‌ల్లారేలా క‌నిపించ‌డం లేదు. చూడాలి మ‌రి ఏం జరుగుతుందో..?