`ఫ్రెండ్స్ రిక్వెస్ట్` ఆడియెన్స్ ను థ్రిల్ కు గురి చేసే మంచి హర్రర్ ఎంటర్ టైనర్ ఆదిత్యా ఓం

మోడ్రన్‌ సినిమా బ్యానర్‌పై ఆదిత్యా ఓం స్వీయ దర్శక నిర్మాణంలో విజయ్‌వర్మ పాకలపాటి నిర్మాణ భాగస్వామ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌’. సోషల్‌ మీడియా బ్యాక్‌డ్రాప్‌పై రూపొందుతోన్న ఈ చిత్రంలో ఆదిత్యా ఓం ప్రత్యేక పాత్రలో నటించారు. రోహిత్‌, ప్రకాష్‌, శీతల్‌, రిచాసోని,సాగరిక ఛైత్రి, మనీషా కేల్‌కర్‌, నితేష్‌ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 8న రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా దర్శకనిర్మాత ఆదిత్యా ఓంతో ఇంటర్వ్యూ….

కాన్సెప్ట్ ఏంటి..?

– ముఖ్యంగా ఈరోజు యువ‌త ఎక్కువ‌గా సోష‌ల్ మీడియాకు అడిక్ట్ అయిపోయారు. దీనివ‌ల్ల వారి సైకాల‌జీ, బిహేవియ‌ర్‌లో చాలా మార్పులు వ‌చ్చాయి. దీన్ని బేస్ చేసుకుని, ఎంట‌ర్ టైన్మెంట్‌, హ‌ర్ర‌ర్ ప్ర‌ధానాంశాలుగా రూపొందించిన చిత్ర‌మే ఫ్రెండ్ రిక్వెస్ట్‌. రెండున్న‌ర‌, మూడు సంవ‌త్స‌రాలు క్రితం ఈ సినిమాను స్టార్ట్ చేశాను. అప్ప‌టి వ‌ర‌కు సోష‌ల్ మీడియా వ‌ల్ల నా ఫ్రెండ్స్‌, శ్రేయోభిలాషుల్లో ఎలాంటి మార్పు వ‌చ్చిందో గ‌మ‌నించాను. దీని ద్వారానే నాకు ఈ సినిమా ఆలోచ‌న వ‌చ్చింది.

క్యారెక్ట‌ర్ గురించి….

– ఈ చిత్రంలో నేను ఘోస్ట్ సైకాల‌జిస్ట్ అనే స్పెష‌ల్ క్యారెక్ట‌ర్‌లో న‌టించాను. సినిమాలో నా క్యారెక్ట‌ర్ వ్య‌వ‌థి 25 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అయితే సీరియ‌స్‌గా సాగే సినిమాలో నా పాత్ర ఎంట‌ర్‌టైనింగ్‌గా మారుస్తూ అక్క‌డి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కరించే రోల్‌. ఈ క్యారెక్టర్ కోసం వేరే నటులను అనుకున్నాం కానీ చివరకు విజయ్ వర్మగారి సలహా మేర ఈ క్యారెక్టర్ ను నేనే చేయాలనుకుంటున్నాను.

తెలుగులోనే ముందు రిలీజ్ అవుతుంది…

– సినిమాను తెలుగు, హిందీ భాష‌ల్లో రూపొందించాం. ప్ర‌తి సీన్‌ను రెండు వేర్వురుగా చిత్రీక‌రించాం. అయితే తెలుగులో ముందుగా విడుద‌ల‌వుతుంది. నాలాంటి ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు హిందీలో సినిమా రిలీజ్ చేయాలంటే చాలా క‌ష్ట‌మైన విష‌యం. ఇక్క‌డ స‌క్సెస్ అయిన త‌ర్వాత అక్క‌డ రిలీజ్ చేయ‌డం చాలా సుల‌భ‌మవుతుంది. అయితే హిందీ వెర్ష‌న్‌లో జ‌న‌వ‌రి లేదా ఫిభ్ర‌వ‌రిలో విడుద‌ల‌వుతుంది.

సినిమాలో క్యాస్టింగ్ గురించి….

– సినిమాలో గ్లామ‌ర్ కోసం ఎక్కువ మంది హీరోయిన్స్‌ను తీసుకున్నారేమో అనుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో వ‌న్ ఆఫ్ ది లీడ్ రోల్ చేసిన అమ్మాయి ఫేస్ బుక్ బానిస‌లా మారుతుంది. ప్ర‌పంచంలో అంద‌రితో చాటింగ్ చేస్తుంటుంది. త‌ను ఓ పార్టీకి త‌న ఫ్రెండ్స్‌ను పిలుస్తుంది. దీని కోసం దేశంలోని వివిధ ప్రాంతాల వెరైటీని చూపించే అమ్మాయిల‌ను చూపించామంతే. ప్ర‌తి స‌న్నివేశం క్యారెక్ట‌ర్ క‌థ‌లో భాగంగానే ఉంటుంది.

హ‌ర్ర‌ర్ ఎలిమెంట్ ఎంచుకోవ‌డానికి కార‌ణం…

– ప్ర‌పంచ వ్యాప్తంగా చూస్తే హ‌ర్ర‌ర్ అంటే మినిమ‌మ్ బ‌డ్జెట్‌లో బాగా రూపొందించ‌గ‌ల జోన‌ర్‌. నేను కూడా మంచి క‌మ‌ర్షియ‌ల్ సినిమాను మినిమ‌మ్ బ‌డ్జెట్‌లో రూపొందించుకోవాల‌నుకోగానే నాకు ఈ హ‌ర్ర‌ర్ జోన‌ర్‌లోనే చేయాల‌నుకున్నాను.

టెక్నిక‌ల్ స్టాండ‌ర్డ్స్‌….

– ఇప్ప‌టి యూత్‌ను టెక్నిక‌ల్ స్టాండ‌ర్డ్స్ చాలా ఆక‌ట్టుకుంటున్నాయి. ఏ సినిమాకైనా అవే కీల‌కం. ఈ సినిమా విష‌యానికి వ‌స్తే జ‌యాప‌జ‌యాల‌ను ప‌క్క‌న పెడితే ఆదిత్యా ఓం మంచి సినిమా తీశాడ‌ని మెచ్చుకునేలా ఉండాల‌నుకునే ఈ సినిమా చేశాను. క్వాలిటీ, ఎఫ‌ర్ట్ స్క్రీన్‌పై క‌న‌ప‌డాలి. సినిమా చూస్తున్నంత సేపు ఆసక్తికరంగా సాగుతూ ఆడియెన్స్ ను థ్రిల్ కు గురి చేసే హర్రర్ ఎంటర్ టైనర్ అనిపించేంత క్వాలిటీ సినిమాలో కనపడుతుంది.

నెక్ట్స్ ప్రాజెక్ట్..

-చిన్నపిల్లలు, ఫ్యామిలీ ఆడియెన్స్ కోసం తెలుగు నెటివిటీలో మొదటిసారి ఓ ఎలియన్ సినిమా చేయాలనుకుంటున్నాను. అందుకోసం స్క్రిప్ట్ తయారుచేస్తున్నాను. అన్నీ ఎలిమెంట్స్ అనుకున్నట్లు కుదిరితే తెలుగులో నేను చేసేదే మొదటి ఎలియన్ మూవీ అవుతుంది.