ఏజెంట్ ఆత్రేయ కలెక్షన్స్ మరీ వీక్….

ఏజెంట్ ఆత్రేయ కలెక్షన్స్ మరీ వీక్….

కొన్ని సినిమాలు అంతే.. మంచి టాక్ తో ఓపెన్ అయినా కూడా క‌లెక్ష‌న్లు మాత్రం అస్స‌లు రావు. ఇప్పుడు ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ విష‌యంలో కూడా ఇదే జ‌రుగుతుంది. న‌వీన్ పొలిశెట్టి హీరోగా వ‌చ్చిన ఈ చిత్రాన్ని కొత్త ద‌ర్శ‌కుడు స్వ‌రూప్ ఆర్ఎస్జే తెర‌కెక్కించాడు. మంచి స్క్రీన్ ప్లేతో కొత్త క‌థ‌ను తీసుకుని ఆస‌క్తిక‌రంగా ఆత్రేయ సినిమా తెర‌కెక్కించాడు ఈయ‌న‌. సినిమాకు కూడా మంచి టాక్ వ‌చ్చింది. దాంతో క‌చ్చితంగా మంచి వ‌సూళ్లు రావ‌డం ఖాయం అనుకున్నారంతా. మ‌రో చిన్న సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మాయ చేస్తుంద‌ని అంతా అనుకున్నారు. కానీ ఊహించింది ఒక‌టి.. అక్క‌డ జ‌రుగుతుంది మాత్రం మ‌రొక‌టి.

ఆత్రేయ సినిమాకు పాజిటివ్ టాక్ వ‌చ్చినా కూడా వ‌సూళ్లు మాత్రం రావ‌డం లేదు. ఈ చిత్రానికి తొలి రోజు ఊహించిన క‌లెక్ష‌న్లు రాలేదు.. రెండో రోజు కూడా ప‌రిస్థితి అలాగే ఉంద‌ని తెలుస్తుంది. అంత మంచి టాక్ వ‌చ్చినా కూడా వ‌సూళ్లు ఊహించినంత రాక‌పోవ‌డంతో నిరాశలో ఉన్నారు చిత్ర‌యూనిట్.

ప్ర‌మోష‌న్స్ సరిగ్గా చేయకపోవడమే దీనికి కారణం అంటున్నారు. కొత్త హీరో గా ఇంట్రడ్యూస్ అవుతున్నప్పుడు చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తే రీచ్ పెరుగుతుంది. కానీ హీరో మాత్రం సెలెక్టివ్ గా చేశాడట. పబ్లిసిటీ విషయంలో నిర్మాతలు కక్కుర్తి పడ్డారనిపించింది.

ఏదైనా మొదటి మూడు రోజుల కలెక్షన్స్ కీలకం. కానీ ఆ ఛాన్స్ ఆత్రేయ మిస్ అయ్యాడు. సినిమా అంతా బాగున్నా కూడా వీక్ క్లైమాక్స్ ఆత్రేయ‌కు మైన‌స్ అవుతుంది. మొత్తానికి న‌వీన్ పొలిశెట్టి అండ్ టీం ఇప్పుడు ఏదో ఒక‌టి చేసి ఏజెంట్ ను హిట్ ట్రాక్ ఎక్కించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. మ‌రి ఇది ఎంత‌వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి