సీమాంధ్ర చిన్నోడు, తెలంగాణ అన్నగా అజిత్

తెలుగులో ఇటీవల ఆట ఆరంభం, వీరుడొక్కడే చిత్రాలతో ఘనవిజయాన్ని సాధించిన అజిత్ హీరోగా తమిళ్ లో సూపర్ హిట్ అయిన అట్టగాసం చిత్రాన్ని నాతో పెట్టుకోకు గా తెలుగులో అనువదిస్తున్నారు. తమిళంలో నాలుగు చిత్రాలను నిర్మించి మంచి విజయాలను అందుకున్న జీ.ఎస్.ఎల్.ప్రొడక్షన్స్ అధినేత జి.ఎస్.లత తాజాగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి ఈ చిత్రం ద్వారా అడుగుపెడుతున్నారు. తెలుగులో జీ.దేవానందం నిర్మాణ సారధ్యం వహిస్తున్నారు.

తమిళ్ లో ఘనవిజయం సాధించిన అట్టగాసం చిత్రం హక్కులను కొనడానికి ఎంతోమంది పోటీపడ్డా మేము ఫ్యాన్సీ రేటు పెట్టి ఆ హక్కులను పొందాము. ఈ చిత్రంలో అజిత్ ద్విపాత్రాభినయం చేశారు. అజిత్ కి జోడీగా పూజా నటించింది. అజిత్ ఇందులో సీమాంధ్ర చిన్నోడుగా, తెలంగాణ అన్నగా నటించారు. వీరిద్దరి మధ్య జరిగే పోరాటాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. ప్రస్తుతం ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలను ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి.

ప్రస్తుతం ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలను త్వరలో పూర్తి చేసుకొని మే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సిద్ధపడుతున్నారు. ఈ చిత్రంలో ఐదు పాటలు అద్భుతంగా ఉంటాయి. ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ వెంకట్ సంగీతం భరద్వాజ్ కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం శరణ్ నిర్మాణ సారధ్యం జీ.దేవానందం నిర్మాత జీ.ఎస్.లత