ధన్ రాజ్, తాగుబోతు రమేష్ ఇరగదీశారట

నేటితరం హాస్యనటులైనటువంటి ధన్ రాజ్, తాగుబోతు రమేష్ లకు ప్రేక్షకుల్లో వారిపై ఉన్న ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఆద్యంతం నవ్వులు చిందించే కథతో యువ దర్శకుడు కోటపాటి శ్రీను ఓ చక్కని కథను సిద్ధం చేసుకొని ఏ.కె.రావ్, పీ.కె.రావ్ పేరిట వెండితెరకెక్కించారు. సాయి వెంకటేశ్వరా కంబైన్స్ సంస్థ దీన్ని నిర్మించింది. అన్ని పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 3వ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

దర్శకుడు కోటపాటి శ్రీను మాట్లాడుతూ… యువ హాస్యనటులైన ధన్ రాజ్, తాగుబోతు రమేష్ పోటీపడి నటించారు. దీనికి సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. సెన్సార్ కూడా పూర్తయింది. మే మూడోవారంలో ప్రేక్షకులముందుకు తీసుకొస్తున్నాం. 

ధన్ రాజ్, తాగుబోతు రమేష్ హీరోలు కాగా దక్షానాగర్కర్, శృతీరాజ్ హీరోయిన్స్.