రాజ్ కందుకూరి చేతులు మీదుగా “ఆకాశవాణి విశాకపట్టన కేంద్రం” పోస్టర్ విడుదల.

రాజ్ కందుకూరి చేతులు మీదుగా “ఆకాశవాణి విశాకపట్టన కేంద్రం” పోస్టర్ విడుదల.
సయిన్స్ స్టూడియోస్ బ్యానర్ పై శివ అండ్ రక్ష, ఉమయ్ చంద్ అండ్ అక్షిత లు హీరో హీరోయిన్ లుగా తెరకెక్కిన చిత్రం “ఆకాశవాణి విశాకపట్టన కేంద్రం”. ఈ చిత్రానికి సతీష్ బాతుల దర్శకుడు. అయితే ఈ సినిమా పోస్టర్ రాజ్ కందుకూరి గారి చేతుల మీదుగా నిన్న విడుదల అయింది. రాజ్ కందుకూరి గారు మాట్లాడుతూ “ఈ కథ నాకు ముందే తెలుసు, సతీష్ కథ చెప్పినప్పుడే మంచి పాయింట్ తో వీళ్ళు సినిమా తీస్తున్నారు, ఇది పెద్ద హిట్ అవుతుంది అని భావించా. ఈ రోజు పోస్టర్ చూస్తుంటే సినిమా ఏ స్థాయిలో ఉంటుందో మనకు అర్ధమవుతుంది. ఈ సినిమాకు సంగీతం అందించిన కార్తీక్ ఎంతో టాలెంట్ ఉన్న సంగీత దర్శకుడు, ఈ సినిమా కెమెరా మ్యాన్ షరీఫ్. మంచి మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు అందరూ ఈ సినిమాకు వర్క్ చేయడం అంటే ఈ సినిమా పెద్ద హిట్ టాక్ తో మన ముందుకు రాబోతుందని మనకు ఇప్పుడే అర్ధమవుతుంది అని అన్నారు. మల్లిఖార్జున వంటి నిర్మాత ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకు రావడం ఆయనకు సినిమా పట్ల ఎంత ఇష్టం ఉందో మనకు తెలుస్తుంది అని కొనియాడారు”. హీరో శివ మాట్లాడుతూ సతీష్ నా దగ్గరకు ఒక మంచి కథ తో వచ్చాడు. కథ వినిన వెంటనే ఈ సినిమా మనం చేస్తున్నాం భయ్యా అని చెప్పా, కథ అంత బాగుంటుంది. 36 రోజుల్లో ఒక అద్భుత కావ్యాన్ని చెక్కాడు మా శివ. తను దర్శకుడి గా ఒక పెద్ద స్థాయిలో ఉంటాడు. అని తెలిపారు. సంగీత దర్శకుడు కార్తీక్ మాట్లాడుతూ ఈ సినిమాకు సంగీతం చేస్తున్నప్పుడే డిసైడ్ అయ్యా, నా ఖాతా లో ఒక పెద్ద హిట్ రాబోతుంది అని. సినిమా సతీష్ తెరకెక్కిన విధానం చాలా బాగుంది. నిర్మాత మల్లిఖార్జున్ మాట్లాడుతూ ముందుగా మా సినిమాకు ఇంత సపోర్ట్ అందించిన రాజ్ కందుకూరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా సినిమా చాలా బాగా వచ్చింది. నాకు కూడా రాజ్ కందుకూరి లాగా నిర్మాత లా నిలబడదాం అనే ఇండస్ట్రీ కి వచ్చాను. మొదటి సినిమానే మంచి కథ తో మీ ముందుకు వస్తున్నా, అందరూ మా సినిమాను సపోర్ట్ చేయండి అని కోరారు. దర్శకుడు సతీష్ మాట్లాడుతూ నేను జబర్దస్త్ షో నుండే మీ అందరికి తెలుసు, ఒక మంచి కథ తయారు చేసుకొని శివ కూ చెప్పా, శివ వెంటనే మనం చేద్దాం భయ్యా అన్నాడు. అలా ఈ సినిమా స్టార్ట్ అయింది. మా సినిమాకు నిర్మాత బ్యాక్ బోన్. తను లేకపోతే ఈ సినిమా లేదు. కార్తీక్ ఇచ్చిన సంగీతం అందరిని కట్టిపడేస్తుంది. షరీఫ్ కెమెరా వర్క్, నా కథ ను మరో లెవెల్ లో కుర్చోపెట్టింది. నా సినిమాకు వర్క్ చేసిన ప్రతి వ్యక్తి తన పూర్తి సహకారం అందివ్వడం వలనే ఈ రోజు మా సినిమా గురించి చిత్ర పరిశ్రమ మాట్లడుకుంటుంది. సినిమా ప్రేక్షకులకు ఖచ్చితంగా ఒక మంచి సినిమా ఇస్తా అనే పూర్తి నమ్మకం నాలో ఉంది అని తెలిపారు. దేవి ప్రసాద్, మాధవి లత, వాసు వర్మ, సూర్య, ధనరాజ్, సత్య, తాగుబోతు రమేష్, సుదర్శన్, భద్రం, రచ్చ రవి, అప్పారావు వంటి భారి తారాగణం నటిస్తున్న ఈ సినిమాకు మేనేజర్ రూపేష్ మామిళ్ళపల్లి, కెమెరా షరీఫ్, డ్యాన్స్ శ్రీ కృష్ణ, ఫైట్స్ ప్రదీప్, మ్యూజిక్ కార్తీక్, ఎడిటర్ ప్రభు, నిర్మాత మల్లిఖార్జున, రచన దర్శకత్వం సతీష్.