అఖిల్ హీరోయిన్ కు ప‌వ‌న్ సాయం..

స‌యేషా సైగ‌ల్.. ఈ పేరు ఎక్క‌డో విన్న‌ట్లుంది క‌దా..! అఖిల్ సినిమాతో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైంది ఈ బ్యూటీ. ఈ సినిమా ఇచ్చిన షాక్ తో ఏడాదిగా తెలుగు ఇండ‌స్ట్రీ వైపు చూడ్డ‌మే మానేసింది స‌యేషా. అయితే ఇండ‌స్ట్రీలో అవ‌కాశాలు రాన‌పుడు హీరోయిన్ల ద‌గ్గ‌రున్న అతిపెద్ద ఆయుధం అందాల ఆర‌బోత‌. అడిగినా అడ‌క్క‌పోయినా ఆడియో వేడుక‌ల్లో, ప‌బ్లిక్ ఫంక్ష‌న్ ల‌లో ఓ రేంజ్ లో అందాలు ఆర‌బోస్తుంటారు. దాన్ని బ‌ట్టే అర్థం చేసుకోవాలి.. వాళ్లు దేనికైనా సిద్ధంగా ఉన్నారని. కొంద‌రైతే డైరెక్ట్ గా చెప్పేస్తుంటారు. తమ‌కు కారెక్ట‌ర్ డిమాండ్ చేస్తే ఎంత వ‌ర‌కైనా వెళ్తామ‌ని. ఇప్పుడు అఖిల్ బ్యూటీ స‌యేషా సైగ‌ల్ కూడా ఇదే చేస్తోంది.

ఈ మ‌ధ్యే హిందీలో శివాయ్ సినిమాలో న‌టించింది స‌యేషా సైగ‌ల్. ఇది యావ‌రేజ్ గా నిలిచింది. పైగా స‌యేషాకు మాత్రం రావాల్సినంత పేరు గానీ క్రేజ్ గానీ రాలేదు. అయితే ఇప్పుడు ఓ బంప‌ర్ ఆఫ‌ర్ స‌యేషా త‌లుపు త‌ట్టింద‌ని స‌మాచారం. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలో న‌టించే ఆఫ‌ర్. అవును.. ఏఎం ర‌త్నం-నీస‌న్ కాంబినేష‌న్ లో ప‌వ‌న్ చేయ‌బోయే వేదాళం రీమేక్ లో స‌యేషా సైగ‌ల్ నే హీరోయిన్ గా తీసుకుంటున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇందులో అఫీషియ‌ల్ క‌న్ఫ‌ర్మేష‌న్ ఇంకా రాలేదు. పైగా స‌యేషా కూడా అవ‌కాశాల కోసం ఎలాంటి గ్లామ‌ర్ షోకైనా సిద్ధ‌మంటోంది. ఇప్ప‌టికే బికినీకి.. టూ పీస్ కు.. లిప్ లాక్ సీన్ల‌కు అన్నింటికీ ఓకే చెప్పేసింది స‌యేషా సైగ‌ల్. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఇవి అస‌లు మ్యాట‌రే కావంటోంది ఈ బ్యూటీ. అయితే న్యూడ్ గా న‌టించ‌డం మాత్రం త‌న వ‌ల్ల కాదంటూ స‌మాధాన‌మిచ్చింది స‌యేషా. మ‌రి ప‌వ‌న్ చ‌లువుతోనైనా అఖిల్ బ్యూటీ కెరీర్ ఒడ్డున ప‌డుతుందా..?