మ‌హేష్ సినిమా కోసం లుక్ మార్చేసిన అల్ల‌రి న‌రేష్‌…?

అవును సూప‌ర్‌స్టార్ మ‌హేష్ కొత్త చిత్రం కోసం హీరో అల్ల‌రి న‌రేష్ త‌న బాడీ లుక్ మార్చాడ‌ట‌.  సినిమాల్లోకి ఎంట్రీ  ఇచ్చిన‌ప్ప‌టినుంచి స‌న్న‌గా ఒకే తీరున క‌నిపిస్తూ వ‌చ్చిన అల్ల‌రి న‌రేష్ ఇటీవ కాస్త బొద్దుగా క‌నిపించ‌డం చూసి చాలామందికి సందేహాలు త‌లెత్తాయి. ఎందుకంటే అత‌డి బాడీ లాంగ్వేజ్‌కి స‌రిపోయే సినిమాలు చేస్తూనే అత‌డు కామెడీ కింగ్‌గా ఎన్నో విజ‌యాల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు మ‌రి.  ఇంత‌కీ కార‌ణ‌మేమిటంటే న‌రేష్ కావాల‌నే ఓ పాత్ర‌కోసం అలా కాస్త బొద్దుగా మారాడ‌ట‌. 

       మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న‌ ‘భరత్ అనే నేను’ సినిమా త‌రువాత వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌కుడిగా తెర‌కెక్క‌బోయే మ‌రో సినిమాలోనూ న‌టించ‌నున్నాడు. అ చిత్రంలో మ‌హేష్‌కు స్నేహిత‌డిగా అల్ల‌రి న‌రేష్ న‌టించ‌నున్న‌ట్టు తెలుస్తోంది.ఈ నేప‌థ్యంలో ఆ పాత్రకు త‌గినట్టుగా అల్ల‌రి న‌రేష్ కూడా త‌న శ‌రీరాకృతిని మార్చుకున్న‌ట్టు స‌మాచారం. ఇటీవ‌ల విజ‌యాల విజ‌యంలో కాస్త వెనుక‌బ‌డ్డ అల్ల‌రి న‌రేష్ ఈ చిత్రంలో పాత్ర‌కు మంచి పేరొస్తే హీరోగానే కాక ఇక ఈ త‌ర‌హా పాత్ర‌ల్లోనూ క‌నిపించ‌డం ఖాయ‌మ‌నుకోవ‌చ్చేమో..!