సంపూర్ణేష్ ని తీసేయడంపై అల్లు శిరీష్ కామెంట్

అల్లు శిరీష్ హీరోగా నటించిన చిత్రం కొత్తజంట. మారుతి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో హృదయకాలేయం ఫేం సంపూర్ణే బాబు కూడా నటించాడు. అయితే ఇప్పుడీ చిత్రంలో సంపూ లేడు. ఎడిటింగ్ లో తీసేశారు. ఇలా ఎందుకు చేశారని అల్లు శిరీష్ ని అడిగితే ఎమన్నాడంటే…. సంపూర్ణేష్ మంచి నటుడు. కానీ సినిమాలో కథకు ఇబ్బంది అవుతుందని సంపూ సీన్స్ వరకు ఎడిటింగ్ చేసి తీసేయాల్సి వచ్చింది. ఫైనల్ గా ఔట్ పుట్ బాగుండాలి కదా. అందుకే తొలగించాల్సి వచ్చింది. అంతేగానీ కావాలని చేయలేదు. సంపూ సీన్స్ తీసేముందు మేమంతా చర్చించుకున్నాం. అంతా ఓకే అన్న తర్వాతే తీసేయాల్సి వచ్చింది. 

శిరీష్, రెజీనా జంటగా నటించిన కొత్త జంట మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతోంది. మధురిమ ఓ కీలక పాత్ర పోషించింది. జె.బి సంగీతమందించిన ఈ చిత్ర పాటలు సూపర్ హిట్టయ్యాయి. సో… సినిమా కూడా సూపర్ డూపర్ హిట్టవుతుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది.