శిరీష్ సైన్స్ పాఠాలు నేర్పుతాడంట‌..

ఒక్క హిట్.. ఒకే ఒక్క హిట్ అల్లు శిరీష్ లో ఎక్క‌డ‌లేని కాన్ఫిడెన్స్ నింపేసింది. అస‌లు త‌న‌ను హీరోగా గుర్తిస్తారో లేదో అని టెన్ష‌న్ ప‌డిన శిరీష్ కు .. శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తుతో మ‌స్త్ మ‌స్త్ హిట్ వ‌చ్చింది. ఈ సినిమాతో అల్లు అర‌వింద్ కు దాదాపు 5 కోట్ల లాభం వ‌చ్చింది. ఈ సినిమా ఇచ్చిన సంతోషంలో కొడుక్కి ఆడి కార్ కూడా గిఫ్టుగా ఇచ్చాడు నిర్మాత అల్లు అర‌వింద్. ఇక శిరీష్ కూడా శ్రీ‌ర‌స్తు తెచ్చిన క్రేజ్ ను పోగొట్టుకూకూడ‌ద‌ని మెంట‌ల్ గా ఫిక్స‌య్యాడు. అందుకే త‌ర్వాతి సినిమాల‌పై కాన్స‌ట్రేష‌న్ పెంచాడు. క‌థ కాస్త అటూ ఇటూగా ఉన్నా.. వెంట‌నే సినిమా ఆపేస్తున్నాడు శిరీష్. ఇప్పుడు కూడా ఇదే చేసాడు.

మ‌ల్లిడి వేణుతోతో శిరీష్ చేస్తోన్న సినిమా ప్ర‌స్తుతానికి ఆగిపోయింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా శిరీష్ ట్విట్ట‌ర్ లో అనౌన్స్ చేసాడు. క‌థ ప‌రంగా దీనికి గ్రాఫిక్స్, విజువ‌ల్ ఎఫెక్ట్స్, లొకేష‌న్స్ చాలా కావాలంట‌.. దానికి తోడు క‌థ‌లో కూడా కొన్ని మార్పులు చేయాల్సి వ‌చ్చింది.. అవ‌న్నీ చేయ‌డానికి మ‌రో ఆర్నెళ్లైనా టైమ్ ప‌డుతుంది. అంత‌వ‌ర‌కు ఖాళీగా ఉండ‌కుండా టైగ‌ర్ ఫేమ్ విఐ ఆనంద్ తో ఓ సినిమా చేయ‌డానికి క‌మిట్ మెంట్ ఇచ్చేసాడు శిరీష్. ఇది కూడా సైన్స్ ఫిక్ష‌న్ క‌థ‌.

శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు లాంటి రొటీన్ క‌థ‌తో హిట్ కొట్టాడు శిరీష్. అయితే రొటీన్ క‌థ‌తో వ‌చ్చిన విజ‌యాన్ని నిలుపుకోడానికి కాస్త భిన్న‌మైన దారిలో వెళ్తున్నాడు అల్లు వార‌బ్బాయి. సైన్స్ ఫిక్ష‌న్ క‌థ‌లు తెలుగు ఇండ‌స్ట్రీకి పెద్ద‌గా క‌లిసొచ్చిన దాఖ‌లాల్లేవు. అయినా స‌రే ఆనంద్ తో అలాంటి ప్ర‌యోగానికే సిద్ధ‌మ‌వుతున్నాడు శిరీష్. ఇక మ‌ల్లిడి వేణు సినిమా కూడా 700 ఏళ్ల నాటి పున‌ర్జ‌న్మ‌ల నేప‌థ్యంలో సాగే క‌థ‌. మొత్తానికి శిరీష్ త‌న ఫ్యూచ‌ర్ పై పిచ్చ క్లారిటీతో ఉన్నాడు. ఎంతైనా విజ‌యం తెచ్చే ఆనందం అంటే ఇదేన‌ప్పా..!