అమ‌రావ‌తి మాస్ట‌ర్ ప్లాన్ రెఢీ…రాజ‌మండ్రికి సింగ‌పూర్ టీం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన మాస్టర్‌ప్లాన్ తుది రూపు దిద్దుకుంది. దీనిని సింగపూర్ టీం సిద్ధం చేసింది. ఈ నెల 20న సింగ‌పూర్ మంత్రి ఈశ్వ‌ర‌న్ నేతృత్వంలో రాజ‌మండ్రికి రానున్న బృందం, చంద్ర‌బాబుతో భేటీ కానుంది. ఇటీవ‌ల పుష్క‌రోత్స‌వంలో అప‌శ్రుతులు చోటుచేసుకోవ‌డం, తొక్కిస‌లాట జ‌రిగి 27 మంది మృతి చెంద‌డంతో అప్ర‌మ‌త్త‌మైన ఏపీ స‌ర్కార్ అక్క‌డి నుంచే పాల‌న సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే! ఈ నెల 22న క్యామినేట్ స‌మావేశం కూడా అక్క‌డే జ‌ర‌గ‌నుంది. కాగా సింగ‌పూర్ బృందం పుష్క‌ర స్నాన మాచ‌రించాకే తిరుగు ప్ర‌యాణం కానుంది.

మ‌రోవైపు విజ‌య‌వాడ‌లో తెలుగుదేశం పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ నెల 21 నుంచి స‌మావేశాలు ప్రారంభం కానుందున‌, స‌భ్యులు అనుస‌రించాల్సిన వ్యూహంపై చ‌ర్చించ‌నున్నారు. సీఎం చంద్ర‌బాబు నేతృత్వాన స్థానిక గేట్ వే హోట‌ల్‌లో మ‌ధ్యాహ్నం 2:30 నుంచి 5:30 దాకా ఈ స‌మావేశం నిర్వహించనున్నారు. త‌రువాత విజ‌య‌వాడ రూర‌ల్ మండ‌లం, కొత్తూరులో జరిగే ఇఫ్తార్ విందుకు బాబు హాజ‌రుకానున్నారు.