నాడు ఎన్టీఆర్ వాడుకున్నాడు…నేడు ప‌వ‌న్‌..చంద్ర‌బాబు డ్రామాలు

ప్ర‌త్యేక‌హోదా విష‌యంలో జ‌న‌సేన అధినేత టీడీపీ ఎంపీల‌పై విమ‌ర్శ‌లు చేస్తున్న నేప‌థ్యంలో ఏపీ పాలిటిక్స్ హాట్‌హాట్‌గా మారాయి. చంద్ర‌బాబు డ్రామాల‌పై వైకాపా నేత అంబ‌టి రాంబాబు విరుచుకుప‌డ్డారు. 2009 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఎన్టీఆర్ సాయం తీసుకుని, కాస్తో..కూస్తో ల‌బ్ధిపొందిన బాబు, తరువాత ఎన్టీఆర్‌ను పూర్తిగా మ‌ర‌చిపోయాడ‌ని దుయ్య‌బ‌ట్టారు. అవ‌స‌రం తీరాక ఆయ‌న‌ను చేర‌దీయ‌డం దండ‌గని ప‌క్క‌న‌పెట్టార‌ని ఆయ‌న అన్నారు.

ఇక మొన్న ఎన్నిక‌ల్లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ సాయం తీసుకుని సునాయాసంగా గెలిచాడ‌ని..అయితే త‌ర్వాత ప‌వ‌న్ త‌న పార్టీ ఎంపీల‌ను టార్గెట్ చేస్తున్నా చంద్ర‌బాబు మాత్రం జ‌వాబు ఇవ్వొద్ద‌ని పార్టీ నేత‌ల‌కు బాబు వార్న్ చేస్తున్నాడ‌ని కూడా అంబ‌టి ఫైర్ అయ్యాడు. రేపు వేళ గ్రేట‌ర్ బ‌రిలో జ‌నసేన కార్పొరేట‌ర్లు గెలిస్తే.. అప్పుడు మ‌ళ్లీ ప‌వ‌న్ సాయం అవ‌స‌ర‌మ‌వుతుంద‌ని టీడీపీ బాస్ ప‌వ‌న్‌ను దువ్వుతున్నార‌ని అంబ‌టి విమ‌ర్శించారు.