రోబో-2లో విలన్‌గా అమీర్‌ఖాన్… ఐ ట్రైలర్‌కు పడిపోయాడట

ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్న సినిమా ఐ. దక్షిణ భారతదేశపు సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న ఈ చిత్రం విడుదలకు ముందే ఎన్నో సంచలనాలు సృష్టిస్తోంది. రూ.175 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఐ సినిమా ట్రైలర్స్ కేక పెట్టిస్తున్నాయి. ఈ ట్రైలర్‌ను చూసిన బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్ శంకర్‌తో చేసేందుకు ఆసక్తి కనపరుస్తున్నాడట. గతంలోనే శంకర్ అమీర్‌ను రోబో-2లో విలన్ క్యారెక్టర్ పాత్ర కోసం సంప్రదించగా అమీర్ చూద్దామన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఐ పోస్ట్‌ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న శంకర్ తన నెక్ట్స్ సినిమా రోబో-2కు వచ్చే వేసవిలో ముహూర్తం ఖరారు చేసినట్టు కోలీవుడ్ సమాచారం. 

రజనీకాంత్ హీరోగా నటించే రోబో-2 కథ ఇప్పటికే సిద్ధమైందట. ఈ సినిమాలో విలన్‌గా అమీర్‌ఖాన్ నటిస్తే దేశంలోనే క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంనడంలో సందేహం లేదు. ఐ ప్రాజెక్ట్ పూర్తయ్యాక రోబో-2 ప్రీ ప్రొడక్షన్ పనులను శంకర్ ప్రారంభిస్తాడట. మరి ఈ క్రేజీ ప్రాజెక్టులో విలన్ చేసేందుకు అమీర్ ఒప్పుకుంటాడా లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.