అమ్మానాన్న ఊరెళితే రివైజింగ్ సెన్సార్ పూర్తి

సుజాత ఆర్ట్స్ పతాకంపై గాజుల ఖాదర్ భాషా నిర్మాణ సారథ్యంలో అంజి శ్రీను దర్శకత్వంలో నిర్మాత జక్కుల నాగేశ్వరరావు నిర్మించిన చిత్రం అమ్మా, నాన్న ఊరెళితే. ప్రముఖ నటి సోనియా అగర్వాల్ ఐటం సాంగ్ తో పాటు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఇటీవల సెన్సార్ సమస్యలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. నిర్మాత జక్కుల నాగేశ్వరరావు ఈ సినిమా సెన్సార్ నిమిత్తం రివైజింగ్ కమిటీకి వెళ్లగా ఎ సర్టిఫికెట్ తో రివైజింగ్ కమిటీ నుంచి ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమౌతోంది. 

 ఈ సందర్భంగా చిత్ర నిర్మాత జక్కుల నాగేశ్వరరావు మాట్లాడుతూ… ఈ సినిమా చిత్రీకరణ ఎప్పుడో పూర్తయింది. సెన్సార్ విషయంలోనే విడుదల ఆలస్యం అయింది. మొదట సెన్సార్ అయిన ఈ చిత్రానికి ఎక్కువ కట్స్ విధించడంతో రివైజింగ్ కమిటీకి వెళ్లడం జరిగింది. కమిటీ సభ్యులు ఈ చిత్రానికి చిన్న చిన్న కట్స్ చెప్పి ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. సెన్సార్ విషయంతో ఎంతో విసిగిపోయి, ఇంక సినిమాను ఆపేద్దాం అనుకున్న మాకు రివైజింగ్ కమిటీ సభ్యుల నుంచి ఎ సర్టిఫికెట్ తో ఈ చిత్రం బయటికి రావడం ఆనందాన్ని కలిగించింది. త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం. అన్నారు. 

 సిద్ధార్థ్ వర్మ, విజయ్, మధు, తేజ, శిల్పాస్మిత, మనస్విని, తనూష, సుస్మిత, శివకృష్ణ, అపూర్వ, ఎఫ్.ఎమ్ బాబాయ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మున్నాకాశి సంగీతమందిస్తున్నాడు.