నిర్మాణానంతర కార్యక్రమాల్లో ‘అమృత నిలయం’

విజయ్‌, మమత, రిషివర్మ, సుహాసన ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న చిత్రం ‘అమృత నిలయం’. రాజా విక్రమ నరేంద్ర దర్శకుడు. ఆర్‌.పి సమర్పణలో అను ఫిల్మ్‌ బ్యానర్‌పై రామమోహన్‌ నాగుల, ఎం.ప్రవీణ్‌ కుమార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉంది. 
దర్శకుడు మాట్లాడుతూ… ప్రస్తుత సమాజంలో యువత తాగిన మైకంలో వారు చేసే పొరపాట్ల వల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అలాంటి కుటుంబాల్లో ఓ అంధుడి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం అని అన్నారు. 
నిర్మాతలు మాట్లాడుతూ… వైజాగ్‌లో ఎక్కువ శాతం షూటింగ్‌ చేశాం. సింగిల్‌ షెడ్యూల్‌లో సినిమా పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశలో ఉన్నాయి. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను విడుదల చేస్తాం అని తెలిపారు. 
ఈ చిత్రానికి కథ, మాటలు: రవినాయక్‌, సంగీతం: రాం, పీఆర్వో: వీఆర్‌ మధు.