నాగార్జునతో యాంకర్ అనసూయ రొమాన్స్… ముద్దుల మరదలిగా

యువసామ్రాట్ అక్కినేని నాగార్జున తాజా చిత్రం సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో నాగార్జున మరదలి పాత్రలో హాట్ యాంకర్ అనసూయ నటిస్తోందని ఫిల్మ్‌నగర్ లేటెస్ట్ టాక్. బుల్లితెరపై ఇప్పటికే హాట్ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న అనసూయ బుల్లితెర స్క్రీన్‌ను తన అంద చందాలతో షేక్ చేస్తోంది. ఇక ఆమె హాట్ అందాలకు మన్మథుడు నాగార్జున తోడైతే ఇంకేముంటుంది వెండి తెర వెలిగిపోతుంది.

నాగార్జున, అనసూయ మధ్య కెమిస్ట్రీ బాగుంటుందని ఆమెను నాగ్ మరదలి పాత్రకు ఎంపిక చేసినట్టు సమాచారం. అనసూయ నాగ్‌తో కలిసి ఓ పాటకు స్టెప్పులు కూడా వేస్తుందని సమాచారం. కళ్యాణ్‌కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి, రమ్యకృష్ణ హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. హంసానందిని కీలక పాత్రలో నటిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఉయ్యాల జంపాల నిర్మాత రాధామోహన్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.. హలోబ్రదర్ తరహాలో సోగ్గాడే చిన్ని నాయన వినోదాత్మకంగా కొనసాగుతుందని సమాచారం. ఏదేమైనా నాగ్ మరదలి పాత్రలో అనసూయ వెండి తెరను ఎలా వేడెక్కిస్తుందో చూడాలి.